movie reviews

సినిమా :- మా వింత గాధ వినుమా (2020)

సినిమా :- maa vintha gadha vinuma movie (2020)
నటీనటులు :- సిద్దు జొన్నలగడ్డ , సీరత్ కపూర్, తనికెళ్ళ భరణి
మ్యూజిక్ డైరెక్టర్:-  శ్రీచరణ్ పాకాల 
డైరెక్టర్ :- ఆదిత్య మండల 

కథ:-ఈ కథ సిద్ధూ (సిద్ధూ జొన్నలగడ్డ) అనే కేర్ ఫ్రీ యువకుడి ని పరిచయం చేస్తూ మొదలవుతుంది. చూస్తూ ఉండగానే సిద్ధూ వినీత (సీరత్ కపూర్) అనే అమ్మాయి ప్రేమలో పడుతాడు. ఆ అమ్మాయి అతని వెంట పడేలా చేసుకుంటుంది కానీ అతని ప్రపోసల్ ని అంగీకరించదు. ఆలా కాలేజీ అయిపోయే సమయం వచ్చేసరికి ఇద్దరు ప్రేమించుకోవడం మొదలవుతుంది. ఆలా కలం హ్యాపీ గా గడుస్తుంది అనుకుంటు ఉండగా వినీత వాలా బ్రదర్ పెళ్లి కి సిద్ధూ వినీత కలిసి గోవా కి వెళ్తారు. అక్కడ పార్టీ లో అనుకోకుండా తాగేసి సిద్ధూ మరియు వినీత పెళ్లి చేసేసుకుంటారు. ఆ పెళ్లి వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో వాళ్ళ వీరిద్దరిమధ్య బ్రేకప్ అవుతుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది. వీడియో వాలా ఇద్దరి ఫామిలీస్ ఎలా బాధపడ్డారు. చివరికి సిద్ధూ వినీత కలిసారా లేదా ఇదంతా తెలుసుకోవడానికి మా వింతగాధ సినిమా ఆహ లో చూసేయండి.

👍

*  సిద్ధూ తన నటన తో సినిమాని పైకి తీసుకొని వచ్చాడు వన్ మ్యాన్ షో. 
* సినిమాకి సంబంధించిన ప్రతి ఒక క్యారెక్టర్ తమ తమ పాత్రకి న్యాయం చేసారు. 
* కథ చక్కగా వ్రాసుకున్నారు. 
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది. 
*సినిమాటోగ్రఫీ బాగుంది.
*  ప్రొడక్షన్ విలువలు కూడా  బాగున్నాయి.

👎

* సినిమా  నిదానంగా సాగుతుంది. 
* కధనం సరిగా రాసుకోలేక దర్శకుడు విఫలం అయ్యాడు. 
* మొదటి 35 నిముషాలు ఎక్కువ డ్రాగ్ చేసారు.

ముగింపు :-
మొత్తానికి మా వింతగాధ వినుమా చిత్రం సిద్ధూ వలా ఒకసారి చూసేయచ్చు. ఈ కథ రాసుకునేటపుడు పేపర్ మీద బాగా నచిందాచు కానీ స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోక పోవడం వాళ్ళ సినిమా అంతగా ఇంపాక్ట్ కలిగించలేకపోయింది. తనికెళ్ల భరణి గారిని చాల రోజుల తర్వాత మల్లి తన స్థాయికి తగిన నటనని మాకు చూపించి కనువిందు చేసారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా పనితీరు బాగుంది. పాటలు ఓకే. దర్శకుడు సరిగా తీయలేకపోవడం వాలా ఈ సినిమా ఎక్కువగా చూసే ఇంట్రెస్ట్ రాదు కానీ సినిమా అంత సిద్ధూ తన నటనతో పైకి తీసుకొని వచ్చాడు. ఈ వారం లో సరదాగా ఒకసారి చూసేయచ్చు.

maa vintha gadha vinuma movie రేటింగ్ :- 2/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button