Maa Oori Polimera Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Movie :- Maa Oori Polimera ( 2021 ) Review
నటీనటులు :- సత్యం రాజేష్ , బాల ఆదిత్య , కామాక్షి భాస్కర్ల , గెటప్ శ్రీను , రవి వర్మ మొదలగు
నిర్మాత :- భోగేంద్ర గుప్తా
సంగీత దర్శకుడు:- గ్యాని సింగ్
డైరెక్టర్: – డాక్టర్ అనిల్ విశ్వనాథ్
Story ( Spoiler Free ):-
ఈ కథ ఒక అనుమానాస్పద వ్యక్తి చేతబడి చేసే సన్నివేశం తో మొదలవుతుంది. తర్వాత కోమరయ్య , జంగయ్య , బల్జి లా అన్నదమ్ముల సన్నివేశాలు జరుగుతాయి. ఇలా సినిమా సాగగా సర్పంచ్ ( రవి వర్మ ) యొక్క కామ బుద్ధి చూపియడం జరుగుతుంది. ఇంకోపక్క జంగయ్య పోలీస్ అయ్యి తన ఊరిలోనే ఉద్యోగం తెచ్చుకుంటాడు. కొన్ని అనుకోని సందర్భాల చేత సర్పంచ్ కార్ ప్రమాదం లో చనిపోగా, కొద్ది రోజుల తర్వాత కొమరయ్య , మరియు గుర్తుతెలియని వ్యక్తి శవం చేతబడి చేసిన ప్రదేశం దగ్గర కనబడుతాయి. ఇప్పుడు జంగయ్య ఈ కేస్ నీ ఎలా సాల్వ్ చేశాడు అనేదే సినిమా.
అస్సలు చేతబడి ఎవరు చేస్తున్నారు ? ఎలా కొమరయ్య చనిపోయాడు ? జంగయ్య కేస్ ఎలా సాల్వ్ చేశాడు ? గుర్తు తెలియని శవం ఎవరిది ? ఆ శవానికి కొమరయ్య కి ఏమైనా సంబంధం ఉందా ? చివరికి ఏం జరిగింది ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా హాట్ స్టార్ లో చూడాల్సిందే.
Positives 👍 :-
- సత్యం రాజేష్ , బాల ఆదిత్య నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. విరి నటనతో ప్రేక్షకులను స్క్రీన్ కి కట్టిపడేస్తారు. మిగిలిన నటీనటులు కూడా వారివారి పాత్ర మేరకు బాగా చేశారు.
- దర్శకుడు అనిల్ విశ్వనాథ్ సినిమా మొదటినుంచి చివరిదాకా కథను నడిపే విధానం చాల బాగుంది ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు.
- ట్విస్ట్లు చాల బాగున్నాయి.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
Negatives 👎 :-
- బూతులు మ్యూట్ చేయాల్సింది.
- రవివర్మ సన్నివేశాలలో కొన్ని సన్నివేశాలు తీసేయచ్చు.
Overall :-
మొత్తానికి మా ఊరి పొలిమేర అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు , ముఖ్యంగా కాన్సెప్ట్ సినిమా లవర్స్ కి విపరీతంగా నచ్చే సినిమా అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. సత్యం రాజేష్ మరియు బాల ఆదిత్య కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అని చెప్పడం లో కూడా ఎటువంటి సందేహం లేదు. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కథను నడిపే విధానం చాల బాగుంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా తీశారు. చివరి 40 నిమిషాలు సినిమాకే హైలైట్.
సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల బాగుంది. నిర్మాణ విలువలు చాల స్టైలిష్ గా తెరమీద కనబడ్డాయి. మొత్తానికి ఈవారం ప్రేక్షకులు ఈ సినిమాని హ్యాపీ గా ఓసారి చూసేయచ్చు.
Rating :- 3.5/5