looser real story – yadhaartha kathalu
కార్తిక్ రియల్ స్టోరీ…
#yadhaarthakathalu #telugurealstories

looser real story – yadhartha kathalu: అందమైన కుటుంబం.ఏ లోటు లేకుండా చూసుకునే తల్లితండ్రులకి పుట్టిన ఏకైక సంతానమే కార్తీక్. తల్లితండ్రుల ప్రేమానురాగాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అల్లారుముద్దుగా పెరుగుతాడు. అతని జీవితంలో కోరుకుంది ఏదైనా వుంది అంటే అది, అతని అమ్మ నాన్న చదివిన కాలేజీలోనే గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటాడు.
అతని వయసు 16 సంవత్సరాలు అప్పుడే ఇంటర్ పూర్తి చేసుకొని అతని అమ్మ నాన్న చదువుకున్న కాలేజ్లో అడ్మిషన్ కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి అప్పటి నుండి రోజూ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటాడు.
ఓ వైపు తల్లితండ్రులు కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. ఇంకోవైపు కార్తీక్ రిజల్ట్స్ టెన్షన్లో పడి సరిగా భోజనం కూడా చేసేవాడు కాదు.అలాంటప్పుడు కార్తీక్ తండ్రి జనార్దన్ అతనికి ధైర్యం చెప్పి భోజనం తినిపిస్తాడు. రిజల్ట్స్ రోజు రానే వస్తుంది. ఎంతో టెన్షన్ టెన్షన్ తో కార్తీక్ తన రిజల్ట్స్ చూస్తాడు.
కార్తీక్ కోరుకున్న ఏకైక కోరిక తీరలేదు.రిజల్ట్స్ లో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని వస్తుంది. ఆ వార్త చుసిన కార్తీక్ తట్టుకోలేక పోతాడు. తీవ్ర దిగ్భ్రాంతికి గురై అమ్మానాన్న చదివిన కాలేజీ లో చదవాలనే కోరిక నెరవేర్చలేకపోతున్నానేమో అని తనలో తాను మధనపడుతూ ఆ వార్తని జీర్ణించుకోలేక,అమ్మ నాన్నకి తన ముఖం చూపించలేక అపార్ట్మెంట్ మీద నుంచి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. ఆ వార్త విని ఆఫీస్ లో వున్న కార్తీక్ అమ్మానాన్న బాధపడుతూ పనులు మానుకొని హుటాహుటిన హాస్పిటల్ కి వస్తారు.

కార్తీక్ కండిషన్ చాలా క్రిటికల్ గా వుంది అని డాక్టర్ చెప్తారు. ఎన్నో టెస్టులు చేశాము అన్నిట్లోనూ ప్రాబ్లెమ్ లేదనే చూపిస్తుంది. కానీ, ట్రీట్మెంట్ కి కార్తీక్ మనసు సహకరించలేకపోతుంది.హాస్పిటల్ కి బ్రతకడానికి వచ్చినవాళ్లు ట్రీట్మెంట్ కి సహకరిస్తారు. ఎంతో పెద్ద పెద్ద కేసులు అయినా బ్రతికి బయటపడినవారు ఉన్నారు. కానీ మీ అబ్బాయి బ్రతకాలని కోరుకోవడం లేదు. చనిపోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మేము ఎంత ప్రయత్నం చేసినా ఫలితం దక్కదు అని డాక్టర్ చెప్తాడు.
కార్తీక్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ కాలేదు కానీ కాలేజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో సీట్ రాలేదు అని ఇలా చేసుకున్నాడు అంటే అతనికి అతను లూసర్ అని అనుకుంటున్నాడు. అతని మనసులో లూసర్ అనే భావన కలిగింది. పర్లేదు మళ్లీ మళ్లీ ప్రయత్నించి గెలవాలి అనే విధంగా చేయాలి అని తన తండ్రి జనార్దన్ అనుకుంటాడు.
అపుడు జనార్దన్ స్పృహలో లేని కార్తీక్ దగరికి వెళ్ళి తన గతం గురించి చెప్తాడు. గతంలో తాను ఎంత పెద్ద లూసరో చెప్పి కార్తీక్ మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు, తదుపరి రోజు జనార్దన్ తాను కాలేజీ రోజుల్లో జీరో నుంచి ప్రజాదరణ పొందటానికి ఎంత కృషి చే శాడో కార్తీక్ కి చెప్తాడు.
కాలేజీ రోజుల్లో జనార్దన్ బ్రిలియంట్ స్టూడెంట్ కానీ అతనిని ఎవరూ ప్రోత్సహించేవారుకాదు. కానీ జనార్దన్ తనని తాను నమ్ముకుని తనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవడమే కాక తనతో పాటు ఉన్న తోటి విద్యార్థులకి కూడా ఆత్మ స్థైర్యాని పెంచుతాడు. అసలు పరీక్షల్లో పాస్ అయితే చాలు భగవంతుడా అనుకునే వాళ్ళు పరీక్షలలో 80% తెచ్చుకునేలా చేస్తాడు. అలాగే ఒక్క సబ్జెక్టు కూడా పాస్ కాని విద్యార్థులని ప్రోత్సహించి పాస్ అయ్యేలా ఎలా చేశాడో అలాగే వాళ్ళ కాలేజీ లో ప్రతి సంవత్సరం నిర్వహించే ఆటలలో ఒకసారి కూడా గెలవని టీంని ప్రోత్సహించి, మనోధైర్యం పెంచి 70 ఆటలు గెలిచేలా చేస్తాడు. కానీ ఫైనల్ రౌండ్ లో ఓడిపోతారు. అయినా కూడా వాళ్ళు ఓడిపోయినట్లు కాదు వాళ్ళు, ఒక ఆట గెలవని వాళ్ళు కష్టపడి 70 ఆటలు గెలిచారు అక్కడే వారు విజయం సాధించారు అని కొడుకు కార్తీక్ మనసులో మనోస్థైర్యం ఉదయించడానికి ఉదాహరణలెన్నో చెప్తాడు.
కార్తీక్, వాళ్ళ నాన్న చెప్పిన మాటలకి ధైర్యం తెచ్చుకుని మానసికంగా దృఢంగా తయారై ఆపరేషన్ థియేటర్ కి వెళ్తాడు. తల్లితండ్రులు బాధతో భగవంతుణ్ణి మొక్కుతూ కూర్చుంటారు.
ఆపరేషన్ పూర్తి చేసి డాక్టర్ బయటికి వచ్చి, జనార్దన్ గారు మీరు గెలిచారు. మీరు కార్తిక్ లో నింపిన స్ఫూర్తి అతనిని బ్రతికించింది.
కొన్ని సంవత్సరాల తర్వాత కార్తీక్ వాళ్ళ అమ్మ నాన్న చదివిన కాలేజీ లోనే సీట్ సంపాదిస్తాడు.
నీతి :
మన ఈ జీవితాల్లో అనుకున్నవన్నీ వెంటనే జరిగిపోతాయా, జరిగితే అది జీవితం కాదు. అలా జరిగిన జీవితానికి అర్థమే లేదు. జీవితం అనేది కలల ప్రపంచం.ఆ కలల్ని నిజం చేసుకోవాలంటే, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎనో సార్లు ప్రయత్నించాలి. ఓడిపోయినా బాధపడకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. ప్రయత్నంతో గెలుపుకి శ్రీకారం చుట్టాలి. గెలుపుతోనే జీవితాన్ని కొత్తగా ఆవిష్కరించుకోవాలి అంతేకాని ఆత్మహత్యలే సమస్యకి పరిష్కారం కాదు..