Hair Fall: హెయిర్ ఫాల్ ఇబ్బంది పెడుతోందా? ఇలా ట్రై చేయండి
Reduce Hair Loss: హెయిర్ ఫాల్ ఇది ప్రతి ఒక్కరిలో ఇప్పుడు ఉంటున్న కామన్ ప్రాబ్లమ్. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో జుట్టు రాలిపోతోందని దీనిని ఎలాగైనా నివారించాలని ఒత్తిడి గురవుతుంటారు. హెయిర్‌ఫాల్‌కి మనం అనేక కారణాలు చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు, తీసుకునే ఆహారం, ఒత్తిడి, వాతావరణం ఇలా మనం అనేక కారణాలు చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు హెయిర్ ఫాల్‌కు ఏవిధంగా అడ్డుకట్ట వేయాలో తెలుసుకుందాం..
ప్రోటీన్ ఆహారం..
మాంసం, చేపలు, సోయా లేదా ఇతర ప్రొటీన్లు తినడం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో సహాయపడుతుంది.

గ్రీన్ టీ..
గ్రీన్ టీని జుట్టుకు రుద్దడం వల్ల జుట్టు రాలడం సమస్యను అరికట్టవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పడు మీరు చేయాల్సిందల్లా ఒక కప్పు నీటిలో రెండు బ్యాగ్‌ల గ్రీన్ టీని వేసి కాచి చల్లార్చి, ఆపై మీ జుట్టుకు అప్లై చేయండి. ఒక గంట తర్వాత మీ జుట్టును బాగా కడగితే సరిపోతుంది.
విటమిన్ ఫుడ్..
విటమిన్లు మన ఆరోగ్యానికే కాకుండా జుట్టు ఒత్తుగా పెరగడాన్ని కూడా ప్రోత్సహిస్తాయి. జుట్టు కుదుళ్లు గట్టిగా ఉండటానికి విటమిన్- ఇ (తాజా ఆకుకూరలు, నట్స్) తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. విటమిన్-బి జుట్టుకు నిగనిగలాడే నల్లటి రంగును ఇవ్వడానికి తోడ్పడుతాయి.