ఆ అబ్బాయినే పెళ్ళిచేసుకుంట… లేదంటే చచ్చిపోతానంటూ హోర్డింగ్ ఎక్కినా యువతి !

మధ్యప్రదేశ్ లో ఓక మైనర్ బాలిక ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకుంటానని లేదంటే చనిపోతానని ఆ బాలుడి కోసం హోర్డింగ్ ఎక్కిన ఘటన కలకలం రేపింది.
ఇండోర్ నగరంలోని పర్దేశిపుర ప్రాంతంలోని భండారీ బ్రిడ్జి వద్ద ఒక మైనర్ బాలిక హోర్డింగ్ ఎక్కడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బాలికను కిందికి దించే ప్రయత్నం చేశారు.
కానీ ఆ బాలిక హోర్డింగ్ దిగడానికి ససేమిరా అంది. తాను ప్రేమించిన వ్యక్తిని తన తల్లి ఒప్పుకోవడంలేదని, స్పష్టం చేసింది.
బాలుడితో పెళ్లికి తల్లి ఒప్పుకోకపోయినా సరే నేను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాల్సిందేనని ఆ అమ్మాయి పోలీసులను కోరింది. దాంతో పోలీసులు ఆమె ప్రేమించిన అబ్బాయిని తీసుకొచ్చి ఆమె ముందు ఉంచడంతో సంతోషంతో ఆ బాలిక హోర్డింగ్ పైనుంచి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
పర్దేశిపుర పోలీస్ ఇన్ స్పెక్టర్ అశోక్ పాటిదార్ ఈ ఘటనకు సంబందించిన పూర్తీ వివరాలను మీడియాకు తెలియజేసాడు.