Tollywood news in telugu

Liger Lover Is under NCB interrogation : డ్రగ్స్ కేసు లో లైగర్ లవర్ ? :-

Liger Lover Is under NCB interrogation

Liger Lover Is under NCB interrogation : అవును మీరు విన్నది నిజమే లైగర్ లవర్ ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వారు ఇంటరాగేషన్ కి పిలవడం జరిగింది. అసలు లైగర్ లవర్ ఎవరు అనుకుంటున్నారా అదేనండి విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఎంటర్ ఆయె హీరోయిన్. ఆమె పేరే అనన్య పాండే.

మ్యాటర్ లోకి వెళ్తే కొన్ని రోజుల క్రితం షారుక్ ఖాన్ కొడుకు అయినా ఆర్యన్ ఖాన్ ని మరియు అతని స్నేహితులని ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు లో అరెస్ట్ చేసి, ఇప్పటికి విచారణ చేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. దానికితోడు ఆర్యన్ ఖాన్ కోసం ఎన్ని విధాలుగా బెయిల్ పెట్టిన కోర్ట్ నిరాకరిస్తూ వచ్చింది.

ఇదిలా ఉండగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో వారు ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్స్ మరియు ఇల్లీగల్ డ్రగ్స్ డీలర్స్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని చెక్ చేయడం మొదలుపెట్టగా తరుచు అనేక సందర్భాలలో అనన్య పేరు రావడం గమనించి నార్కోటిక్స్ బృందం ముందుగా అనన్య ఇంట్లో దర్యాప్తు చేశారు.

ఆది పూర్తయ్యాక అనన్యనే ముంబైలోని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కి విచారణ కోసం రమ్మని చెప్పగా అనన్య పాండే , తన తండ్రి మరియు ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినా చంకీ పాండే తో కలిసి నార్కోటిక్స్ కార్యాలయానికి వెళ్లారు. విచారణ ఇంకా జరుగుతుంది.

అనన్య కి డ్రగ్ డీలర్స్ తో ఏమైనా సంబంధం ఉందొ లేదో క్లారిటీ లేదు. విచారణలో తెలుస్తుంది. చూడాలి మరి నార్కోటిక్స్ బృందం అనన్య తో జరిగిన ఇంటరాగేషన్ ద్వారా ఎలాంటి నిజాలు బయటపెట్టబోతున్నారో.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button