Viral news in telugu

మీకు ఎడమచేతి వాటం ఉందా… అయితే మీరుకూడా ఈ సెలెబ్రిటీలలా .. ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు… !

Left-handed celebrities : మనం ఏపని చేసిన మాములుగా కుడిచేతితో చేస్తూ ఉంటాం. అలాగే ఎపుడైనా పొరపాటుగా ఏదైనా వస్తువుని ఎదుటివారికి ఇచ్చేటపుడు ఎడమ చేతితో ఇస్తే, మన పెద్దవారు కోప్పడి, కుడిచేతితో ఇవ్వమని చెబుతారు. ఇలాంటి మూఢ నమ్మకాలు ఇప్పటికి మన మధ్య తారస పడుతూ ఉంటాయి. ఇదంతా పక్కన పెడితె.. ప్రపంచ   జనాభాలో ఎడమచేతి వాటం కలిగిన వారు  20%. అదేవిదంగా మన దేశంలో సుమారు 10-15శాతం ఎడమచేతివాటం కలవారు ఉన్నారు. మామూలుగా ఏ పనైనా   కుడిచేత్తో చేసేవారు చాల ఎక్కువ… కానీ ఎడమచేత్తో కొందరు పని చేస్తూ ఉంటే … మనం వారిని స్పెషల్ గా  చుస్తూఉంటాం . మరి ఇలాంటి ఎడమ చేతివాటం వారికీ ఒక స్పెషల్ రోజు కూడా ఉంది. అదే  “వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే”…..

ఈ “వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే” ను ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. కానీ ఈ విషయం చాల తక్కువ మందికి తెలుసు.  ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఎడమ చేతివాటం ఉన్నవాళ్లందరూ గొప్పవాళ్లు అవుతారో లేదో తెలీదుగానీ, కొందరు గొప్పవాళ్ళు ఎడమచేతి వాటం ని కలిగి ఉంన్నారు. వారిలో కొందరిని మీకు పరిచయం చేయబోతున్నాం.

అమితాబ్ బచ్చన్:

Left-handed celebrities

లెఫ్ట్ హ్యాండర్ సెలబ్రిటి అనగానే మొదటగా  గుర్తొచ్చే పేరు బిగ్ బి అమితాబ్ బచ్చన్… తన మూవీస్ లో కూడా ఎడమ చేతిని ఎక్కువగా వాడుతూ ఉంటాడు. ..అభిషేక్ బచ్చన్ ది కూడా ఎడమ చేతివాటమే..

సచిన్ టెండుల్కర్:

సచిన్ కూడా  లెఫ్ట్ హ్యాండరే కానీ  నేనెప్పుడూ రైటే.. అని చమత్కారంగా అంటాడు  సచిన్ టెండుల్కర్..

రతన్ టాటా:

రతన్ టాటాది కూడా ఎడమ చేతినే వాడుతారు . దేశంలో ఎడమచేతివాటం  వారి కోసం కృషిచేస్తున్న ‘లెఫ్ట్ హ్యాండర్స్ ఇండియా’ సంస్థకు టాటా సంస్థ స్కాలర్షిప్ కూడా అందించింది.

సావిత్రి:

మహానటి సావిత్రి ది కూడా ఎడమ చేతి వాటమే.

సన్ని లియోన్:

ఈ శృంగార భామ కూడా తన ఎడమ చేతినే ఎక్కువ వాడుతుంది.

బరాక్ ఒబామా:

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఎడమ చేతినే వాడతారు.

మార్క్ జుకర్ బర్గ్:

ఫెస్ బుక్ దిగ్గజం మార్క్ జుకర్ బర్గ్ కూడా ఎడమచేతి వటమే….

బిల్ గేట్స్:

మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ ది కూడా ఎడమ చేతి వాటంతోనే పైకి ఎదిగాడు…

వీళ్లు మాత్రమే కాదు వాజ్ పేయి,ఏంజెలినా జోలి, కరన్ జోహార్,సోనాక్షి సిన్హా, ఐన్ స్టీన్,అరిస్టాటిల్, మేరి క్యూరి, డావిన్సి, ధీరూబాయి అంబాని, ఇలా చెప్పుకుంటూ పోతే ఎడమచేతివాటం కలిగిన సెలబ్రిటిలు చాల మంది ఉన్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button