Leader Sequel Script Ready : లీడర్ 2 స్క్రిప్ట్ రెడీ :-

Leader Sequel Script Ready : 2010 లో రానా దగ్గుపాటి మరియు శేఖర్ కమ్ముల కలిసి చేసిన గొప్ప ప్రయత్నమే లీడర్. ఈ సినిమా అప్పట్లో రానా కెరీర్ కి ఎంతో ప్లస్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా లో ఎప్పటిలాగే శేఖర్ కమ్ముల తన మార్క్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులని సినిమాకి కట్టిపడేశారు.
ఈ సినిమా గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. ఈ సినిమా లో కథ కానీ కధనం కానీ ఎక్కడ అనవసరపు సన్నివేశాలు లేకుండా కంటెంట్ ని నమ్ముకొని ఘానా విజయం సాధించింది.
అయితే ఇటీవలే శేఖర్ కమ్ముల గారు తన లవ్ స్టోరీ సినిమా ప్రొమోషన్స్ సమయం లో విలేఖరులు లీడర్ గురించి అడగగా అయినా ఈ విధంగా స్పందించారు ‘ లీడర్ 2 అంటే లీడర్ సీక్వెల్ కథ సిద్ధంగా ఉంది. ఈ సీక్వెల్ కూడా రానా తోనే తీయబోతున్నాను. అయితే రానా తన కమిట్ అయినా ప్రాజెక్ట్స్ అని పూర్తయ్యాక ఈ సినిమా మొదలుపెడుతాను ‘అని చెప్పారు.
మొత్తానికి లీడర్ సీక్వెల్ ఉండబోతుంది అందులో రానా నే మరల నటించబోతున్నారని క్లారిటీ వచింది. అయితే ఈ సినిమా ఎపుడు స్టార్ట్ అవుతుందనేది రానా చేతిలోనే ఉంది.
రానా ప్రస్తుతం విరాట పర్వం , భీమ్లా నాయక్ , వెంకీ మామ తో రానా నాయుడు ఇలా వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఈ సినిమా ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చూడాలి మరి.