Tollywood news in telugu

Vakeel Saab Review: వకీల్ సాబ్ సినిమా పెద్ద హిట్ కొట్టబోతుందంటూ… ఫస్ట్ రివ్యూ ఇంచ్చిందెవరో తెలుసా…!

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి  కొన్నాళ్లు సినిమాలకు దూరమైపోయిన పవన్  కళ్యాణ్.. వకీల్ సాబ్‌తో తిరిగి  రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. పవన్ సినిమా కోసం తన ఫాన్స్ కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. హీరో పవన్ ని మళ్ళీ బిగ్ స్క్రీన్ పై ఎపుడు చూస్తామా.. థియేటర్స్ లో హంగామా ఎపుడు చేద్దామా అని ఆరాట పడుతున్నారు.

ఏప్రిల్ 9న  గ్రాండ్‌గా ‘ వకీల్ సాబ్ ‘ రిలీజ్  కాబోతుంది. సినిమాకు ఏ కొంచం మంచి టాక్ వచ్చిన , రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం . ఈ సందర్బంగా ఓవర్ సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా చెప్పుకునే ఉమైర్ సంధు , అభిమానుల్లో ఉత్సాహమ్ నింపే కామెంట్స్ చేసాడు.

పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ అని, సింగిల్ కట్ లేకుండా సెన్సార్ పూర్తి చేసుకుందని వకీల్ సాబ్ సెన్సార్ రిపోర్ట్ సాలిడ్ అండ్ టెర్రఫిక్ అంటూ ట్విట్టర్ అకౌంట్‌లో రాసుకొచ్చాడు. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అందుకోబోతున్నారంటూ తేల్చేశాడు.

ఉమైర్ సంధు చేసిన కామెంట్స్ ని కొంతమంది లైట్ తీసుకుంటున్నారు. ఇతడు గతంలో  కాటమరాయుడు, అజ్ఞాతవాసి చిత్రాలకు కూడా విడుదలకు ముందే సాలిడ్ హిట్స్ అంటూ జోస్యం చెప్పాడు. కానీ అవి పెద్దగా హిట్ కొట్టలేదు. ఉమైర్ కేవలం ప్రజల ద్రుష్టి తనవైపు తిప్పుకొనేందుకు ఇలాంటి పనులు చేస్తాడని అంటున్నారు.

ఎవరేమి అనుకున్న వకీల్ సాబ్ సినిమాపై పాజిటివ్ బజ్ ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నా .. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button