Tollywood news in telugu
ఇక సమ్మర్ లోనే రానున్న ‘వకీల్ సాబ్’ !

పవన్కళ్యాణ్ రాజకీయాలతో పాటు కొంత సమయాన్ని సినిమాకోసం కేటాయిస్తున్నారు. ఈ సందర్బంగా `వకీల్ సాబ్` సినిమాషూటింగ్ లో పాల్గొంటున్నాడు.
బాలీవుడ్ లో విజయవంతమైన `పింక్` సినిమాకు ఇది రీమేక్ గా `వకీల్ సాబ్`ను వేణు శ్రీరామ్ దర్శకుడు, బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ సరసన శ్రుతి కథానాయికగా నటిస్తోంది.ఈ జంటపై అభిమానులకు సినిమా విజయం పై బారి అంచనాలు పెరిగిపోయాయి.
వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని ప్రచారం జరిగింది. అయితే ఇంకా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండటంతో ఈ సంక్రాంతి బరి నుంచి పవన్ తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
వేసవి సందర్భంగా, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారట. ‘వకీల్ సాబ్’ గా పవన్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడాలంటే సమ్మర్ వరకు ఆగాల్సిందే.