Tollywood news in telugu

కమల్ సినిమాలో విలన్ పాత్ర చేయనున్న ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు, నిర్మాత…!

 Lawrence

Lawrence : ప్రముఖ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీకి పరిచయమై, తరువాత దర్శకుడిగా, నిర్మాతగా తనదైన  ముద్ర వేసుకొని ఆ తరువాత హీరో గా మారారు  లారెన్స్.  విభిన్నమైన కథలను ఎంచుకుంటూ చిత్రాలను రూపొందిస్తున్నాడు. అదేవిదంగా పలు సినిమాలు కూడా పెద్ద హిట్టు  కూడా సాధించాయి.

ఇక లారెన్స్ వ్యక్తిగతంగా ఎంతోమందికి తన సొంత డబ్బుతో ఎన్నో సేవ కార్యక్రమాలు చేసారు. ప్రస్తుతం ఇపుడు  ప్రముఖ నటుడు కమలహాసన్ సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం.  అందులో కమల్ కు విలన్ గా చేయనున్నట్టు తెలుస్తుంది.

ఈ మధ్యన  వరుసగా  విజయాలను తన కాతాలో వేసుకుంటున్న  దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తన తాజా చిత్రాన్ని కమలహాసన్ తో  తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు  ‘విక్రమ్’ అనే పేరు కూడా  ఖరారు అయింది .  కమల్ హాసన్  తమ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగును అతి త్వరలో నిర్వహించనున్నారు. 

ఇక ఈ చిత్రంలో ప్రధాన విలన్ పాత్ర కోసం  లారెన్స్ తో దర్శకుడు లోకేశ్ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button