Tollywood news in telugu

Lasya Wedding anniversary gift: పెళ్లిరోజు నాడు….భర్తకు, లాస్య ఆంటీ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా…!

Lasya Wedding anniversary gift

Lasya Wedding anniversary gift : తెలుగు ప్రేక్షకులను తన నవ్వులతో అలరిస్తూ…. దగ్గరైన  యాంకర్‌ లాస్య. గతంలో యాంకరింగ్ తో అలరించి , కొన్నాళ్లుగా దూరమై, తరవాత  గతేడాది బిగ్ బాస్ 4లో కనిపించి మళ్లీ ప్రేక్షకుల దగ్గరైంది.  దాదాపు 70 రోజుల పాటు ఈ షోలో అలరించింది.   బిగ్ బాస్ సీజన్ 4 లో  అత్యధిక రెమ్యునరేషన్ కూడా కొట్టేసింది. లాస్యకు   రెమ్యునరేషన్  రోజుకు  60 వేల వరకు  ఇచ్చినట్లు ప్రచారం . ఇది నిజమైతే లాస్య  బిగ్ బాస్ ద్వారా 30 లక్షల పైన్ సంపాదించుకుంది.

 ఇదిలా ఉంటే ఇప్పుడు లాస్య తన భర్తకు విలువైన గిఫ్ట్ ని ఇచ్చింది. వారి పెళ్లి రోజు సందర్భంగా ఒక లగ్జరీ కారును ఇచ్చింది.  భర్త మంజునాథ్‌కు ఈ గిఫ్ట్ ఇచ్చి తన ప్రేమని చాటుకుంది లాస్య .  లాస్య ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంకోసం, వారి ఇంట్లో వాళ్లతో పోరాడినా ఫలితం లేకపోయే సరికి అతన్ని బయట పెళ్లిచేసుకుంది. తరవాత కొన్ని రోజులకు వారి కుటుంబం ఒప్పుకోవడంతో  మల్లి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది.

గతంలో వ్యక్తిగత కారణాలతో యాంకరింగ్‌కు దూరం కాగా , ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీకి ఇచ్చింది  లాస్య.  తాజాగా కొన్ని షోలకు యాంకరింగ్ కూడా మొదలు పెట్టింది . ఇదిలా ఉంటే ఫిబ్రవరి 15 లాస్య పెళ్లి రోజు. ఈ సందర్భంగా “మహీంద్రా ఎక్స్‌యూవీ 500 ” కారు ను  భర్తకు గిఫ్ట్ గా  ఇచ్చింది. ఈ కారు  ధర 15 లక్షలకు పైగానే ఉంటుంది.

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button