Lakshya Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Movie :- Lakshya (2021) Review
నటీనటులు : – నాగ శౌర్య, కీటీకా శర్మ, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ మొదలగు.
నిర్మాతలు: – నారాయణ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్
సంగీత దర్శకుడు :- కాల భైరవ
దర్శకుడు:- సంతోష్ జాగర్లపూడి
Story ( Spoiler Free ):-
ఈ కథ పార్ధు ( నాగ శౌర్య ) చిన్ననాటి వయస్సులోనే ఆర్చరీ నేర్చుకునే సన్నివేశాలతో మొదలవుతుంది. అలా అలా ఆర్చరీ మీద శ్రద్ధ పేట్టి ఛాంపియన్ అవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు పార్ధు. ఇదే క్రమంలో రితిక ( కిటిక శర్మ ), పార్ధు నీ ప్రేమిస్తుంది. ఇలా పార్ధు లైఫ్ హ్యాపీ గా కొనసాగుతున్న సమయంలో లో కొని అనుకొని అడ్డంకులు ఎదురవుతాయి. ఇలా అనుకొని సంఘటనలతో ఎం చేయాలో తెలియక పార్ధు మత్తు పదార్థాలకు భానిస అయ్యి పోటీలో పాల్గొంటాడు కానీ పోటీలో ఓడిపోతాడు.
అస్సలు పార్ధు జీవితంలో జరిగిన అనర్ధాలు ఏమిటి ? ఎందుకు మత్తు పదార్థాలు తీసుకోవాల్సి వచ్చింది ? దీని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా ? వీటన్నిటి మధ్య జగపతి బాబు పాత్రెంటి ? చివరికి పార్ధు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు లేదా ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Positives 👍 :-
- సినిమాలో అందరూ చాలా బాగా వారి వారి పాత్రలలో జీవించేశారు. నాగ శౌర్య కొత్తగా మరియు విభిన్న నటనతో ప్రేక్షకులను అలరిస్తాడు.
- దర్శకుడు సంతోష్ సినిమా మొదటినుంచి చివరిదాకా కథనం నడిపిన విధానం బాగుంది.
- క్లైమాక్స్ బాగుంది.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
- నిర్మాణ విలువలు పర్వాలేదు
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
Negatives 👎 :-
- సినిమా స్లో గా సాగుతుంది.
- తెలిసిన కథనే, ప్రేక్షకులు తదుపరి సన్నివేశం గ్రహించగలరు.
- ఎడిటింగ్ ఇంకా చేయాల్సి ఉంది.
Overall :-
మొత్తానికి లక్ష్య అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు , ముఖ్యంగా స్పోర్ట్స్ స్టోరీ సినిమాలు నచ్చే వారికి విపరీతంగా నచ్చే సినిమా అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. నాగ శౌర్య , కీటిక శర్మ చాలా బాగా చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా కి తగ్గినట్లుగా ఉంది.
దర్శకుడు సంతోష్ కథనం నడిపే విధానం చాల బాగుంటుంది. రొటీన్ స్టోరీ , తర్వాత జరిగే సన్నివేశాలు ప్రేక్షకులు గ్రహించగలరు. సినిమాటోగ్రఫీ చాల బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఈవారం కుటుంబం అంత ఈ సినిమాని హ్యాపీ గా ఈ సినిమాని ఓసారి చూసేయచ్చు .
Rating :- 2.5 /5