sports news in telugu

labuschagne sledge: స్లెడ్జింగ్‌ చేస్తున్న లబూషేన్‌ కి… గట్టి కౌంటర్ ఇచ్చిన గిల్

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మూడో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. మ్యాచ్ రెండవ రోజైన శుక్రవారం టీమ్ ఇండియా మ్యాచ్ ముగిసేసరికి 96 పరుగులు రెండు వికెట్లను కోల్పోయింది. మొదట ఓపెనర్లుగా రోహిత్ శర్మ (22),శుబ్‌మన్‌ గిల్‌(50) స్కోర్ చేసి అవుటయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పుజారా(9),రహానే(5) క్రేజీ లో నిలిచారు.

ఈ మేరకు ఓపెనర్లుగా బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ,శుబ్‌మన్‌ గిల్‌ ను ఆస్ట్రేలియా క్రికెటర్ లబూషేన్‌ స్లెడ్జింగ్‌ చేశాడు. మొదట గిల్ ను మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు అంటూ గిల్ ని అడగగా… మ్యాచ్ అయిపోయిన తర్వాత చెప్తాను అని గిల్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. అయిన కూడా మళ్లీ లబూషేన్‌ “సచిన్ నా? లేక విరాట్ ? అన్ని అడిగాడు.. ఆ తర్వాత రోహిత్ శర్మ ను 14 రోజులపాటు క్వారంటైన్ లో ఏం చేసావ్ అని లబూషేన్‌ స్లెడ్జింగ్‌ చేశాడు.
దీంతో లబూషేన్‌ స్లెడ్జింగ్‌ చేయడం పట్ల ఇండియా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button