Tollywood news in telugu

kriti shetty dance viral video :కృతి శెట్టి డాన్స్ చుస్తే….కనురెప్పలుకూడా ఆర్పలేరు…!

kriti shetty dance viral video

kriti shetty dance viral video : తెలుగులో ‘ఉప్పెన’ మూవీ ద్వారా పరిచయమైన సొట్టబుగ్గల చిన్నది  కృతి శెట్టి. ఉప్పెన సినిమా విజయవంతం కావడంతో దేశమంతటా ఈ హీరోయిన్ పేరు మారుమోగిపోయింది . ఈ సినిమాలో హీరో పాత్రకు ఎంతటి ప్రాధాన్యతనిచ్చాడో, హీరోయిన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉండేలా చూసాడు దర్శకుడు. కృతి తన అందంతో పాటుగా తన అభినయంతో కూడా  ప్రేక్షకుల మనసు దోచేసింది.

ఉప్పెన మూవీలోని పాటలకు డాన్స్ లు లేకపోయినా…  తాజాగా షోషల్ మీడియాలో కృతి కి సంబందించిన ఒక డాన్స్ వైరల్ గా మారింది. ఉప్పెన లోని ఒక పాటలో తనలోని టాలెంట్ ని బయటపెట్టింది. అదేంటంటే …ఉప్పెన సినిమాలో హీరో, హీరోయిన్లు కష్టాల్లో ఉండే టైం లో  వచ్చే ‘ఈశ్వరా….పరమేశ్వరా’ అంటూ సాగే పాట ప్రేక్షకులను  ఎంతగానో ఆకట్టుకున్న విషయం అందరికి తెలిసిందే. ఈ పాటకు చాలా అందంగా డాన్స్ చేసింది. తన డాన్స్ చూసినా జనాలు , మరియు  పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.

ప్రస్తుతం ఈ సొట్టబుగ్గల కృతి శెట్టి , నాని ప్రధాన పాత్రలో వస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ లో  నటిస్తుంది. అలాగే సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే మూవీ లో ను  కథానాయికగా చేస్తున్నారు. ఇంకా..  రామ్ పోతినేని, లింగుసామి డైరెక్షన్ లో రూపొందనున్న చిత్రంలో హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇలా పలు అవకాశాలతో ఉప్పెనలా ముందుకు సాగుతుంది కృతి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button