Tollywood news in telugu

Krithi shetty age: కృతిశెట్టి కి ఇంతేనా ?

Krithi shetty age, Salary per Movie, and New Projects: ‘ఉప్పెన ‘ పేరు వినగానే కృతి శెట్టి, అలాగే కృతి శెట్టి పేరు వినగానే ‘ఉప్పెన ‘ సినిమా అందరి మదిలో ఉరకలు వేస్తుంది. ప్రస్తుతం  ఈ పేరు అంతగా ప్రజల గుండెల్లో పాతుకుపోయింది. ఈ పేరు తో పాటు గా హీరో వైష్ణవ్ తేజ్, డైరెక్టర్ బుచ్చిబాబు పేర్లు కూడా మారుమోగిపోతున్నాయి.

 ఈ ముద్దుగుమ్మ కన్నడ నుంచి వచ్చినప్పటికీ ఇపుడు ఈ భామ ను నిర్మాతలు బంగారు బాతుగా చూస్తున్నారు. ఇందులో ఎక్కువగా ప్రేక్షకుల పాత్రే ఉంది. ఎందుకంటే ప్రేక్షకులు ఎవరినైతే ఇష్టపడతారో వారికేకదా డిమాండ్ పెరిగేది. అందుకనే ఇండస్ట్రీ వాళ్లు ప్రేక్షకదేవుళ్లు అనేది , మన ప్రేక్షకులకు నచ్చిందంటే ఇక వారి దశ తిరిగిపోతుంది.

‘ ఉప్పెన’  సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామకు ప్రేక్షకులు తెచ్చిన క్రేజ్ చూస్తూ ఉంటె ఇండస్ట్రీ పెద్దలకు పిచ్చెక్కిపోతుంది.  దర్శక నిర్మాతలు ఇపుడు  కృతి డేట్స్ కోసం పోటీ పడే పరిస్థితి వచ్చింది. దీన్నిబట్టి చుస్తే ఈ హీరోయిన్  తెలుగులో ఫస్ట్ ప్లేస్ కు వెళ్లడానికి మరెంతోకాలం పట్టదని అర్థమవుతుంది.

 ఈ భామను దగ్గరి నుండి ముందే డేట్స్ తీసుకోండి , లేదంటే  ఉప్పెన రిలీజ్ అయితే అమ్మాయి దొరకదు అని చిరంజీవి ప్రీ రిలీజ్ వేడుకలో అన్న  మాటలు అక్షరాలా నిజం కాబోతున్నాయి. ఇపుడు బంగారు బాతులా మారిన కృతిశెట్టి డేట్స్ ఇస్తుందో లేదో అంటూ దర్శక నిర్మాతలు తెగ ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉంటె ఇపుడు ఈ భామ  రెండో సినిమాకే దాదాపు 75 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది.

Krithi shetty age

ఇక అసలు విషయానికి వస్తే…. ఇపుడు జనాలందరూ ఉప్పెన ద్వారా పరిచమై సంచలనాలకు నిలయమైన కృతి శెట్టి వయసు గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రచారం ఎక్కువగా షోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఈ భామ వయసు తెలుసుకోవాలని ఎంతోమంది తెగ ఆలోచిస్తున్నారు. కృతి కి వయస్సు ఎంత ఉంటుంది. ఓ 15 ఉంటుందా… లేదా 18 ఉంటుందా… 20 ఉంటుందా… అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

Heroine Krithi shetty age :

కృతి చూడటానికి చిన్న పిల్లలా కనపడుతుండటం తో తన వయసుపై అందరు మాట్లాడుకుంటున్నారు. ఇపుడు కృతి వయసు కేవలం 17 సంవత్సరాలే నట ,  2003లో జన్మించింది కృతి శెట్టి. ప్లస్ టూ చదువుతున్న ఈ భామకు సినిమా అవకాశాలు రావడానికి గల కారణం లేకపోలేదు. ఈ భామ ముందుగా యాడ్స్ లో నటించడంతో, తెలుగు దర్శక నిర్మాతల కల్లుపడి ఇపుడు ఏకంగా హీరోయిన్ గా మారిపోయింది. ఇపుడు ఉప్పెన సినిమాద్వారా టాలీవుడ్ లో చక్రం చిప్పుతుంది అని చెప్పాలి.

స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరు క్రిటిశెట్టి పేరును గూగుల్ లో సెర్చ్ చేయనివారు  ఉండరేమో. ఇపుడు ఈ భామ  వయసు గురించి సెర్చ్ లు ఎక్కువయ్యాయి. తన వయసు 17 అని తెలిసి తెలుగు ప్రేక్షకులు షాక్ కి గురిఅవుతున్నారు. అదేవిదంగా ఈ భామ నటన చూసి ఫిదా అవుతున్నారు.

 ప్రస్తుతం కృతి శెట్టి,  నాని శ్యామ సింగ రాయ్‌తో పాటు సుధీర్ బాబు మూవీలో  కూడా నటిస్తూ దూసుకుపోతుంది. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా కృతి కి అవకాశాల వెల్లువ కొనసాగుతుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button