Tollywood news in telugu

Krak Box office : మాస్ రాజా క్రాక్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతంటే…!

Krak Box office

హీరో  రవితేజ క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.  కోవిడ్ కష్టకాలంలో జనాలు థియేటర్స్ వస్తారా.. అనే ఆలోచనకు తెరదించి క్రాక్ బారి కలెక్షన్లను రాబట్టింది. ఈ కలెక్షన్లు నిర్మాతలకు  ఒక ధైర్యాన్ని ఇచ్చాయి. పోయిన  సంక్రాంతికి సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ ఇచ్చింది. జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ రాజా మూవీ మంచి కలెక్షణాలను సాధించింది.

 క్లోజింగ్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

మొన్న సంక్రాంతి సెలవులు పూర్తయ్యాక కూడా క్రాక్ హవా ఏమాత్రం తగ్గలేదు. వీకెండ్స్ తో పాటు చాలా వరకు నార్మల్ డేస్ లో కూడా బాగానే సినిమా ఆడింది. దీని ద్వారా కలెక్షన్ ల ఫ్లో కొనసాగింది.  దర్శకుడు నమ్మినట్లే సినిమా థియేట్రికల్ అనుభూతిని ఇచ్చింది. ఇక ఓటీటీ విడుదలైనప్పటికి కూడా కొన్ని చోట్ల కలెక్షన్స్ తగ్గలేదు.

ఈ సినిమాను  డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన నిర్మాత మధు నిర్మించారు.  విడుదలైన 10రోజుల తరువాత కూడా తెలుగు రాష్ట్రాల్లో కోటికి పైగా షేర్స్ అంసించాయి. కేవలం 50ఆక్యుపెన్సీతో ఉన్నపుడే ఒక బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందుకున్న ఈ సినిమా  ఒకవేళ  100ఆక్యుపెన్సీ ఉంటె  మరో రేంజ్ లో కలెక్షన్లు ఉండేవి.

ఇక ‘క్రాక్’ తరువాత వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ , ‘రెడ్’, సినిమాలు మాస్ రాజా మార్కెట్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు.  ఆ సినిమాలకు వారం రోజుల్లోనే కోట్లల్లో  కలెక్షన్స్ వచ్చాయి. కానీ రవితేజ సినిమా మాత్రం 15రోజులైనా కలెక్షన్లు ఒకే  ఫ్లోను కొనసాగించింది. ఒక విధంగా టాలీవుడ్ కు క్రాక్ మంచి బూస్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి.

ఇపుడు  క్రాక్ సినిమా థియేటర్స్ నుంచి వెళ్లిపోయింది. ఇక సినిమా ఫుల్ రన్ టైమ్ లో అందుకున్న మొత్తం షేర్స్ 39.25కోట్లు గా ఉంది.  తెలంగాణ ఏపీలోనే సినిమాకు 37కోట్ల వరకు వచ్చాయి. ఇక మొత్తం కలెక్షన్స్ 70కోట్లని తెలుస్తోంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button