telugu cinema reviews in telugu language

Krack Movie Review: క్రాక్ చిత్రాన్ని చూస్తే మాస్ రాజా ఫ్యాన్స్‌కి పూనకలే

Krack Movie Review: డాన్ శీను, బలుపు చిత్రంలోని హీరో మాస్ మహారాజ్ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న మరో చిత్రం క్రాక్… ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేస్తామని చెప్పి… మార్నింగ్ షో, మ్యాట్ని షో లు నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ల మధ్య డబ్బు వివాదంతో క్యాన్సిల్ అయ్యాయి.. దీంతో క్రాక్ సినిమా చూడాలని థియేటర్ ఎదుట వెయిట్ చేస్తున్నా ప్రేక్షకులకు,మాస్ మహారాజా అభిమానులకు నిజంగానే క్రాక్ తెప్పించారు.

ఎట్టకేలకు ఫస్ట్ షో కి క్రాక్ సినిమాను థియేటర్లో చిత్రబృందం రిలీజ్ చేసింది. దీంతో అభిమానులు పండగ చేసుకున్నారు. ఎంతో ఆనందం ఉత్సాహంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిలకించారు.

ఈ చిత్రం చూసి వచ్చిన ఆడియన్స్ ని రివ్యూ అడగగా సినిమా కేక అన్ని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకో అని రవితేజ ఖాతాలో మరో హిట్ అని క్రాక్ చిత్రంపై పాజిటివ్ టాకే ప్రేక్షకుల నుండి వచ్చిందని చెప్పవచ్చు. మరి ఈ సినిమా స్టోరీ ఏంటి? స్క్రీన్ పై ఎలా ఉంది? ఫైట్స్ ఎలా ఉన్నాయి వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం

మొదట ఈ చిత్రాన్ని చూస్తే మనకు మాస్ మహారాజా కే పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే స్క్రిప్ట్ ను, అలాగే తెరకెక్కించిన మాస్ ఎలెవషన్స్ ను దర్శకుడు గోపీచంద్ మలినేని అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. ఈ చిత్రంలో మొదట బ్యాక్గ్రౌండ్ లో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఈ సినిమాకి ఒక మంచి హైలెట్ ఇచ్చింది. ఆ తరువాత రవితేజ,శృతిహాసన్ బైక్ పైన ఎంట్రీ అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలో రవితేజ కొడుకుగా నటించిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని కొడుకు సూపర్ సెటైర్లు వేశాడు.

ఈ చిత్రంలో రవితేజ “పోతరాజు వీర శంకర్” అనే క్రాక్ పోలీసోడు గా యాక్టింగ్ ఇరగదీశాడు. ఈ చిత్రంలో ముగ్గురు విలన్ లు ఉంటారు. మొదట సలీమ్ (చిరాగ్ జానీ) అని జానీ) దేశంలోనే కరుడుకట్టిన తీవ్రవాదిని, కడప రెడ్డి (రవి శంకర్) అనే ఫ్యాక్షన్ లీడర్ ని, కటారి కృష్ణ (సముద్రఖని) అనే క్రిమినల్ పట్టుకోవడమే షోర్టీ ముఖ్య ఉద్దేశం. జేబులో ఉండాల్సిన నోటు.. చెట్టుకు ఉండాల్సిన కాయ.. గోడకు ఉండాల్సిన మేకు.. అనే ఈ మూడు కాన్సెప్ట్ లతో ముగ్గురు విలన్ లని పోలీస్ ఆఫీసర్ పోతరాజు వీర శంకర్ (రవితేజ) పట్టుకొని తాట తియ్యడమే ఈ సినిమా అసలు కథ.

ఈ చిత్రంలో మొట్టమొదట స్క్రీన్ ప్లే అయితే మైండ్ బ్లోయింగ్ అన్ని చేయవచ్చు. అలాగే ఎంటర్టైన్మెంట్ కీ డోకా లేదు. రవితేజ కి విక్రమార్కుడు తర్వాత సరైన పోలీసోడు పాత్ర అంటే క్రాక్ సినిమానే…”ఒంగోలు నడిరోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో సీసం పోస్తా నా కొడకా..” అని మాస్ డైలాగ్..డీజే కాదు.. ఓజే ఒంగోలు జాతర’ అని రవితేజ డైలాగ్ లు థియేటర్లు లో వింటుంటే అభిమానులకు గూస్ బంప్స్ వచ్చాయి.

చాలా రోజుల తర్వాత తెలుగు భాషలో హీరోయిన్ శృతిహాసన్ రీ ఎంట్రీ ఇవ్వడానికి మంచి సినిమా సెలెక్ట్ చేసుకుందని అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో రవితేజకి భార్యగా కళ్యాణి పాత్రలో శృతిహాసన్ ఇమిడిపోయింది. ముఖ్యంగా ఈమె క్యారెక్టరే చిత్రానికి మంచి ట్విస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు.

ఈ చిత్రంలో ఫైట్స్ ని రామ్ లక్ష్మణ్ అద్భుతంగా కంపోజ్ చేశారు ఫైట్స్ అనేవి యూనిక్ గా ఉన్నాయి. అలాగే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాగ్రౌండ్ మూసిక్స్ ఏ హైలెట్ అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ చిత్రానికి 4.5/5 రేటింగ్ నిర్మొహమాటంగా ఇవ్వచ్చు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button