Tollywood news in telugu

కౌశల్ ఆర్మీ 2k రన్ గ్రాండ్ సక్సెస్

మా టీవీ ఛానెల్ లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ సీజన్ 2 మరికొద్ది రోజుల్లో చివరి అంకానికి చేరుకోనుంది. ఈ షో కి హోస్ట్ గా నాచ్యురాల్ స్టార్ నాని వ్యవరిస్తున్న విషయం అందరికి తెలిసిందే. బిగ్ బాస్ లో ఉన్న కoటెస్టెoట్స్ అందరిలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న వ్యక్తీ కౌశల్. అసలు ఎవరీ కౌశల్? నిన్న మొన్నటి వరకూ పెద్దగా పరిచయం లేని ఈ పేరు సోషల్ మీడియాలో ఫుల్ ప్రభంజనంని సృష్టిస్తుంది అంటే కౌశల్ ప్రభావం బిగ్‌బాస్‌ షో‌లో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బిగ్‌బాస్‌ సీజన్ 2 మొదలైనప్పటి నుండి హౌస్‌లో అందరూ ఒక వైపు ఇతనొక్కడు ఒకవైపు. ఎవరు అవునన్నా కాదన్నా,తను అనుకున్నది అనేస్తాడు, ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు ముఖంపైనే చెప్పేస్తాడు. అందుకే ఆయన బిగ్‌బాస్‌ హౌస్‌లోఅందరికి శత్రువు అయ్యాడు. హౌస్ మేట్స్ ఆయన వెంట లేకపోయిన కోట్లాది మంది అభిమానుల్ని గెల్చుకున్నారు.

హౌస్‌లోని సభ్యులంతా కౌశల్‌ని ఒంటరిని చేసి గ్రూపులు కట్టడంతో కౌశల్‌కు అండగా koushal army ఏర్పాటైంది. ఈ కౌశల్ ఆర్మీకి ప్రేక్షకుల మద్దతు బాగా పెరిగిపోయింది. చివరకు బిగ్‌బాస్ షోను శాసించే స్థాయికి ఈ కౌశల్ ఆర్మీ పెరిగిపోయింది. కేవలం సోషల్ మీడియాలో ట్వీట్లకు మాత్రమే పరిమితం కాకుండా కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బలనిరూపణ ద్వారా తెలియజేసేందుకు ఇప్పుడు ఈ koushal army బిగ్ బాస్ చరిత్రలోనే ఎన్నడు జరగని ఒక కొత్త ట్రెండ్ కి తెరతీసింది. కౌశల్ కి సపోర్ట్ గా హైదరాబాద్ నగరంలో మాదాపూర్‌లో నిన్న(ఆదివారం) ఉదయం 6:30 గంటలకు కౌశల్ ఆర్మీ 2కె వాక్ నిర్వహించింది. దీనికోసం శనివారం కౌశల్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. ఈ వాక్ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ పిలుపునకు కౌశల్ అభిమానుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ 2కె రన్‌కే వేలాదిగా కౌశల్ అభిమానులు తరలివచ్చారు.

Read  అందాల అనసూయా....

ఒక కంటెస్టెంట్ పేరు మీద నిర్వహించిన 2కె రన్‌కి ఇంత భారీగా జనాలు రావడం బహుశా అన్ని భాషలలోని బిగ్ బాస్ షోస్ లో ఇదే తొలిసారి. ఆర్మీ సభ్యులు, కౌశల్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలా మంది మహిళలు, పిల్లలు, పిల్లల తల్లులు కూడా 2కె రన్‌లో పాల్గొనడం ప్రధాన విశేషం. కౌశల్ జిందాబాద్‌ నినాదాలతో హోరెత్తించారు. ఇందుకోసం ప్రత్యేకంగా koushal army పేరుతో ముద్రించిన టీ షర్ట్‌లను, పోస్టర్స్‌ విడుదల చేశారు. అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్సే అవడంతో పోటీ బాగా పెరిగిపోయి ప్రేక్షకులకు ఈ షో మరింత ఇంట్రస్టింగ్‌గా తయారవుతోంది. మరి బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ కౌశల్ అవుతాడా?? లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

 

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button