Kothala Rayudu Movie Review :-

Movie :- Kothala Rayudu (2022) Review
నటీనటులు :- శ్రీకాంత్ , నటాషా దోషి , డింపుల్ చోపాడే , సత్యం రాజేష్ , పోసాని మొదలగు
సంగీత దర్శకుడు :- వసంత్
నిర్మాతలు :- కోలన్ వెంకటేష్
దర్శకుడు: – సుధీర్ రాజు
Story ( Spoiler Free):-
ఈ కథ పెళ్ళి అనే కాన్సెప్ట్ ఇష్టం లేకపోవడం మరియు విపరీతంగా డబ్బు అప్పు చేసైన ఖర్చు చేయాలనుకునే అజయ్ ( శ్రీకాంత్ ) చుట్టూ తిరుగుతుంది. అజయ్ ఒక ట్రావెల్ కంపెనీ లో మేనేజర్ గా పనిచేస్తుంటాడు.
అయితే డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసే అజయ్ కి డబ్బు ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయచ్చు అని అనుకొని ధనలక్ష్మి ( నటాషా ) తో పెళ్లికి సిద్ధం అవ్వగా కొన్ని సందర్భాల ద్వారా ధనలక్ష్మి కి కూడా ఆస్తులు లేవని నిజం తెలుసుకొని చివరి సమయంలో పెళ్ళి ప్లాన్ విరమించుకున్నాడు.
అయితే అనుకోకుండా అజయ్ సంధ్య ( డింపుల్ ) తో ప్రేమలో పడతాడు. ఇప్పుడు అజయ్ పెళ్ళి దాకా వచ్చిన ధనలక్ష్మి నీ పెళ్ళి చేసుకుంటాడా లేదా ప్రేమించిన సంధ్య నీ పెళ్ళి చేసుకుంటాడా ? అజయ్ కోరిక నెరవేరిందా లేదా ? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.
Positives 👍🏻 :-
- ఎప్పటిలాగే శ్రీకాంత్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా మొదటి నుంచి చివరి దాకా శ్రీకాంత్ నటనే హై లైట్ గా నిలుస్తుంది. హీరోయిన్లు ఇద్దరు బాగా చేశారు.
- కథ బాగుంది మరియు కొన్ని కామెడీ ట్రాక్స్ బాగున్నాయి.
- సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్ చాలా బాగున్నాయి.
- నిర్మాణ విలువలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
Negatives 👎🏻 :-
- రొటీన్ స్క్రీన్ ప్లే.
- దర్శకుడు మంచి కథ రాసుకున్నప్పటికి స్క్రీన్ ప్లే సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు.
- రెండు భాగాలు ప్రేక్షకులని పెద్దగా అలరించవు.
Overall :-
చాలా సంవత్సరాల తర్వాత శ్రీకాంత్ హీరో గా చేసిన సినిమా కోతల రాయుడు. ఈ సినిమా కథ పరంగా బాగున్నప్పటికీ కథనం సరిగ్గా లేకపోవడం తో నిరాశ కలిగిస్తుంది. శ్రీకాంత్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు. కానీ కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి.
నిర్మాణ విలువలు బాగున్నాయి, ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. దర్శకుడు కథనం బాగా రసుకునింటే ఈ సినిమా శ్రీకాంత్ నీ హీరోగా కం బ్యాక్ సినీమా అయ్యేది.
శ్రీకాంత్ నటన కోసం ఈ సినిమా ఓసారి చూడచ్చు.
Rating :- 2.5/5