Tollywood news in telugu

Kondapolam Obullama song : అడివి లోని ప్రేమికుల మధ్య పాట :-

kondapolam Obullama Song

Kondapolam Obullama Song : ఇటీవలే ఉప్పెన తో ఘానా విజయం సాధించి మొదటి సినిమాతోనే 100 కోట్లు కొల్లగొట్టాడు వైష్ణవ తేజ్. ఇపుడు తన రెండవ చిత్రంగా కొండపోలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు అని అందరికి తెలిసిందే.

అయితే ఈ సినిమాని క్రిష్ దర్శకత్వం వహించడంతో ఆశలు తారస్థాయిలో చేరాయి. అయితే ఈ సినిమాలో వైష్ణవ తేజ్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా దసరా కానుకగా ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది.

అయితే రిలీజ్ కి దగ్గరవుతున్న సమయం వచ్చేసింది కాబట్టి ప్రొమోషన్స్ హడావిడి మొదలుపెట్టారు. ఈరోజే ఈ సినిమాకి సంబందించిన మొదటి పాటని విడుదల చేశారు. ఆ పాట తేజ్ మరియు రకుల్ మధ్య సాగె ప్రేమ పాట అవడం తో మరింత దగ్గరైపోయింది రిలీజ్ అయినా వెంటనే.

ఓ ఓ ఓ ఓ ఓబులమ్మ అంటూ సాగె ఈ పాట ప్రజలకు విన్న వెంటనే ట్రాన్స్ లోకి వెళ్లిపోయేలా చేసేస్తుంది అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. దానికితోడు కీరవాణి మ్యూజిక్ అందించడంతో మరింత మనసుకి దగ్గరైపోయింది. ఈ పాట‌ను కీర‌వాణి, చంద్ర‌బోస్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాయ‌గా స‌త్య యామిణి పీవీఎన్ ఎస్ రోహిత్ గొంతుకలిపి పాటకి ప్రాణం పోశారు.

మొదటి పాట తోనే అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ఈ సినిమా ముందు ముందు రిలీజ్ అయేలోపు ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి మరి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button