Vaisshnav Tej Kondapolam Movie Review – కొండపొలం

Movie: Kondapolam Revew – (కొండపొలం (2021)
Cast & Crew :- పంజా వైష్ణవ్ తేజ్ , రకుల్ ప్రీత్ సింగ్ , కోట శ్రీనివాస్ రావు , నాజర్ , సాయి చంద్
Producers :- వై. రాజీవ్ రెడ్డి , జె . సాయి బాబు.
Music Director :- కీరవాణి
Director : – Krish Jagarlamudi
Story (Spoiler Free ):-
ఈ కథ యు.పి.యస్.సి విభాగం లోని ఐ.ఎఫ్.యస్ ఎక్సమ్ అయ్యాక జరిగే ఇంటర్వ్యూ తో మొదలవుతుంది. ఇంటర్వ్యూ చేసేవారు కట్టారు రవీంద్ర యాదవ్ ( పంజా వైష్ణవ తేజ్ ) కి ఇంటర్వ్యూ చేస్తుండగా రవీంద్ర తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం తో మొదలవుతుంది.
ఫ్లాష్ బ్యాక్ లో రవీంద్ర కడప లోని నల్లమల ఫారెస్ట్ కి దరిదాపుల్లో ఉన్న గ్రామం లో జీవిస్తుంటాడు. అతనిది నిరుపేద కుటుంబం దానికి తోడు రవీంద్ర భయస్తుడు. రవీంద్ర వాలా నాన్న అయినా సాయి చంద్ గొర్రెల మందన్ని ఎలా చూసుకోవాలో నేర్పించారు.
అయితే రవీంద్ర ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్ లో అనేకరమైన కోర్సెస్ చేసినప్పటికీ సాఫ్ట్ వేర్ ఉద్యోగం రాకపోవడం తో నిరాశ చెంది తన గ్రామాన్ని వెళ్ళిపోతాడు. కొన్ని అనుకోని సంఘటనల వలన రవీంద్ర , సాయి చంద్, ఓబుల్లమ్మ మరియు హేమ, రవి ప్రకాష్ , మహేష్ విట్ట కలిసి నల్లమల ఫారెస్ట్ కి కొండపోలం చేయడానికి వెళ్తారు. ఆ ఫారెస్ట్ లో ఒక పక్క టైగర్ ఇంకో పక్క స్మగ్లర్స్ తో ఫారెస్ట్ లోని మనుషులు భయాందోళనకు గురవుతూ ఉంటారు.
ఆ స్మగ్లర్స్ బొమ్మ కర్ర చెట్లని నరుకుతూ ఉంటారు. వీటన్నిటిని భయస్తుడు అయినా రవీంద్ర ఎలా ఎదురుకుంటాడు? ఎలా ఈ సంఘటనలు అన్ని దాటుకొని ఐ.ఎఫ్.యస్ ఆఫీసర్ అయ్యాడనేదే ఈ సినిమా కథ. ఈ సాహసాలు రవీంద్ర ఎలా చేసాడో తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Positives :-
- పంజా వైష్ణవ్ తేజ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ చాల బాగా నటించారు. భయస్తుడిగా తేజ్ నటన చాల బాగుంది.
- కథ మరియు కథనం.
- కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
- ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండ్ హాఫ్ లో సాగె థ్రిల్లింగ్ మరియు ఎమోషనల్ సన్నివేశాలు.
- దర్శకుడు క్రిష్ తన మార్క్ కథ తో మరల ప్రేక్షకులని ఆలోచించేలా చేశారు.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
- సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.
Negatives :-
- ఒకే సన్నివేశం చాల సార్లు చుపియడం.
- సినిమా స్లో గా సాగుతుంది.
Overall :-
మొత్తానికి కొండపోలం అనే సినిమా క్రిష్ తన స్టైల్ అఫ్ కథ తో ప్రేక్షకులని ఆలోచించేలా చేయడం లో సక్సెస్ అయ్యారు. వైష్ణవ్ తేజ్ కూడా చాల బాగా నటించారు. రకుల్ పాత్రకు తగ్గట్టు న్యాయం చేసింది. మిగితా పాత్రధారులు కూడా బాగా చేశారు. కథ మరియు కధనం బాగుంది కాకపోతే ఒకే సన్నివేశం చాల సార్లు చుపియడం తో ప్రేక్షకులకు బోర్ కోటిస్తుంది. సినిమా స్లో సాగుతుంది. కీరవాణి గారి మ్యూజిక్ బెస్ట్. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మొత్తానికి కొండపోలం సినిమా స్లో అనే విషయం పక్కన పెడితే ఒక చక్కటి ఫీల్ గుడ్ సినిమా చుసిన ఫీలింగ్ తో బయటికి వస్తారు. ఈ వారం కుటుంబం అంత కలిసి చూసే సినిమా.
Rating :- 3/5