కోకో కోకిల మూవీ రివ్యూ
నటీనటులు : నయనతార, యోగి బాబు, శరణ్య పొన్వన్నన్, శరవణన్, రాజేంద్రన్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : శివకుమార్ విజయన్
ఎడిటర్ : ఆర్.నిర్మల్
దర్శకత్వం : నెల్సన్ దిలీప్ కుమార్
నిర్మాతలు : లైకా ప్రొడక్షన్స్
సౌత్ ఇండియాలో సూపర్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయనతార ప్రధాన పాత్రలో లేడీఓరియెంటెడ్ మూవీగా వచ్చిన తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కొలమావు కోకిల’ చిత్రాన్ని తెలుగులో డబ్ చేశారు. తమిళనాట కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించిన ఈ మూవీ మరి తెలుగు ప్రేక్షకులను అలరించిందా? సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
కోకిల(నయనతార) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి తన తల్లికి వచ్చిన కాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే 15 లక్షలు అవసరం అవుతుంది. ఆ డబ్బు కోసం కోకిల అన్నివిధాలా ప్రయత్నించి విఫలం అవుతుంది. బంధువులు, స్వచ్ఛంద సంస్థలు ఏ ఒక్కటి కోకిలకి సహాయపడవు. ఇక ఆ డబ్బుకోసం కోకిల అనుకోని పరిస్థితుల్లో కొనైన్ స్మగ్లింగ్ చేసే డ్రగ్స్ ముఠా కార్యకలాపాల్లో చిక్కుకుంటుంది. అమ్మను కాపాడుకోవడానికి స్మంగ్లింగ్ చేయడానికి కూడా రెడీ అవుతుంది. మరి కోకిల డ్రగ్స్ ఎలా సరఫరా చేసింది ? చేయడానికి ఆమె ఎదురుకున్న ఇబ్బందులు ఏమిటి ? ఆ పరిస్థితుల నుండి కోకిల ఎలా తప్పించుకుంది? అనేది తర్వాతి కథ.
విశ్లేషణ:
మొత్తం సినిమా నయనతార అంటే కోకిల మరియు ఆమె ఫైనాన్షియల్ కష్టాల చుట్టూ తిరుగుతుంది. తన తెలివితేటలతో, అమాయకత్వంతో, విలన్స్ పని పట్టే తీరు ప్రేక్షకులకు నచ్చుతుంది. అలాగే తన తల్లిని కాపాడుకోవడానికి ఆమె పడే కష్టాలు, బాధ ప్రేక్షకులను ఎమోషనల్ సీన్స్ కి కట్టిపడేసెలా చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సహజంగా అనిపిస్తుంది. సినిమాలో డ్రగ్స్ ఇల్లీగల్ బిజినెస్ ని కళ్ళకు కట్టినట్లు చక్కగా చూపించారు.
సినిమాలో కొన్ని సీన్స్ ని అనవసరంగా సాగాతీసారనిపిస్తుంది. తన కుటుంబం తన జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకోవలసి వచ్చే సీరియస్ సన్నివేశంలో అనవసరమైన కామెడీని చేర్చి కథని డైవర్ట్ ని చేయడంతో ప్రేక్షకులకు అంతగా నచ్చదు. క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ చాలా సింపుల్ గా అనిపిస్తాయి. సినిమాలోని ప్రతిదీ తమిళ్ నేటివిటీ కనిపిస్తుంది.
నటీనటులు:
ఈ మూవీలో నయనతార పాత్ర సినిమాకే హైలైట్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె తన పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. నయనతార తర్వాత సినిమాలో ఆమె తల్లి పాత్ర పోషించిన శరణ్య పొన్వన్నన్ అద్భుతంగా నటించింది. యోగి బాబు మొట్టాయ్ రాజేంద్రన్, శరణ్య మంచి పాత్రలు పోషించారు. కోకిలను ప్రేమించే పాత్రలో కమెడియన్ యోగిబాబు నవ్వులు పూయించాడు. మెయిన్ గా యోగి బాబు తన కామెడీ టైమింగ్ తో బాగానే నవ్వించాడు. ఇక మిగిలిన నటీనటులు విజయ్ టీవీ జాక్వెలిన్, రాజేంద్రన్, ఆర్ఎస్ శివాజీ, అన్భుతాసన్ వారి వారి పెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు.
సాంకేతిక విభాగం :
లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణ విలవలు చాలా బాగున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ కథను స్వయంగా తానే రాసి దర్శకత్వం వహించారు. దర్శకత్వ పనితనంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నే ప్రయత్నం చేశాడు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ బావుంది. నిర్మల్ ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది. శివకుమార్ విజయన్ కెమెరా పనితనం బాగుoది. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం బాగుంది. ఇక సినిమా మొత్తంలో ఒకే ఒక్క పాట మాత్రమే ఉంది.
ప్లస్ పాయింట్స్
నయనతార పెర్ఫార్మెన్స్
కథ, కథనం
అనిరుధ్ మ్యూజిక్
యోగిబాబు కామెడీ
మైనస్ పాయింట్స్
సాగదీసిన సీన్స్
తీర్పు :
నయనతార ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ‘కోకో కోకిల’ చిత్రం ఊహించని ట్విస్టులతో సీరియస్ సీన్స్ లో కూడా
మంచి వినోదం పంచే సినిమా.