health tips in telugu
దానిమ్మ తొక్కని పడేసే ముందు ఇది తెలుసుకోండి ! ఇక పడేయరు
Dhanimma: మనం ఎప్పుడు దానిమ్మ పండు తింటుంటాము, దానిమ్మ జ్యూస్ కూడా చేసుకొని తాగుతం కానీ దానిమ్మ తొక్కని మాత్రం అనవసరపు పదార్థం అనుకొని పక్కన పడేస్తుంటం. అక్కడే మనం పప్పులో కాలు వేసినట్లు. నిజానికి దానిమ్మ పండు లో ఎన్ని ఔషధాలు ఉన్నాయి దానికి మించిన ఔషధాలు దానిమ్మ తొక్కలో ఉన్నాయి. ఇప్పుడు మనం దానిమ్మ తొక్క యొక్క ఆరోగ్య ఔషధాలు గురించి తెలుసుకుందాము.

- ఒక్క దానిమ్మ తొక్కలో విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, విటమిన్ బి6, మెగ్నిషియం వంటి ఔషద గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని వలన మనకు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- దానిమ్మ తొక్క ద్వారా మన దంత సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. కాకపోతే దానిమ్మ తొక్కని ఎండబెట్టి , పొడి చేసి దానిలో కొంచెం పుదీనా నూనె మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోని రోజు పల్లు తొమడంతో దంత సమస్యలు ఎవి మన దరిదాపులోకి రావు.
- ఈ దానిమ్మ తొక్కలను నీటిలో వేసి మరిగించి రోజు తాగడం చేత కీళ్ళ నొప్పుల మరియు వాపులు త్వరగా తగ్గిపోతాయి.
- ఈ దానిమ్మ తొక్కని మనకు ఏమైనా దెబ్బలు/ గాయాలు తగిలినప్పుడు బాగా దంచి గాయాలు తగిలిన చోట ఒక కట్టు కడితే ఎటువంటి గాయాలను అయిన త్వరగా తగ్గిపోతాయి.
- మన ముఖంపైన ఎటువంటి డార్క్ సర్కిల్స్ ఉన్న / ముఖంపైన మొటిమలు ఉన్న ఈ దానిమ్మ తొక్కని ఎండబెట్టి నీళ్ళలో నానబెట్టి పేస్ట్ లా చేసుకొని ముఖం పై 30 నిమిషాలు పూసుకొని కడిగేయడం ద్వారా ముఖ సమస్యలు తొలగిపోతాయి.
- వక్షోజాలు దృఢంగా ఉండాలని పరితపించే వారికి ఈ దానిమ్మ తొక్కను అవనునే తో మిక్స్ చేసి బాగా దంచి దానిలోని రసాని రాత్రి సమయాల్లో మర్ధన చేయడం చేత వక్షోజాలు దృఢంగా మారుతాయి.
- ఈ దానిమ్మ తొక్కలను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజు పుక్కిలిస్తే నోరు శుబ్రంగా మారుతుంది. అదే నీళ్ళు తరుచూ తాగడం చేత షుగర్ మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ కరెక్ట్ గా ఉంది గుండె కి సంబందించిన సమస్యలను దూరం చేసేస్తాయి.
ఇలా దానిమ్మ తొక్కలో అనేక ఔషధాలు ఉన్నాయి.