ఆ ముఖ్యమంత్రి ని చంపితే పది లక్షలు ఇస్తాం

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ని చంపితే పది లక్షలు ఇస్తామంటూ మొహాలిలోని సెక్టార్ 66, 67 లోని గైడ్ మ్యాప్ లో ఓ గోడపై గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్ ను అతికించారు. దీన్ని చూసిన కొందరు యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.

దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 504, 506, 120 బీ, పంజాబ్ ప్రివెన్షన్ ఆఫ్ డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్డినెన్స్ యాక్ట్ సెక్షన్ 3, 4, 5 కింద కేసు నమోదు చేశారు. ఈ పోస్టర్ ను సైబర్ కేఫ్ లో ప్రింట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసును సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కు అందజేశారు.
గతంలో డిసెంబర్ 14న మెహాలిలోని అమరీందర్ సింగ్ హోర్డింగ్ ను కొందరు దుండగులు చించేసి…అయిన చిత్రంపై సిరా చాలిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు సీఎం అమరీందర్ సింగ్ ని చంపితే పది లక్షలు ఇస్తామంటూ పోస్టర్ వేయడం..పంజాబ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా అయింది