Today Telugu News Updates

తెలంగాణలో బాలుడి దారుణ హత్య , Kidnap and murder in Telangana

రాష్ట్రంలో చిన్నారుల కిడ్నాప్ , హత్యలు కలకలం రేపుతున్నాయి Kidnap and murder in Telangana మహబూబాబాద్ కు చెందిన దీక్షిత్ రెడ్డి ( 9 ) కిడ్నాప్ , మర్డర్ ఘటనను మరువక ముందే మేడ్చల్ జిల్లాలో మరో దారుణం జరిగింది . శామీర్‌పేట్ లో ఐదేండ్ల బాలుడిని హత్య చేశాడో దుర్మార్గుడు . తర్వాత కిడ్నాప్ డ్రామా ఆడాడు . నిందితుడు చేసిన వాట్సాప్ కాల్ తో 11 రోజుల మిస్సింగ్ మిస్టరీ కాస్తా మర్డర్ గా తేలింది . బీహార్ కు చెందిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు . కేసు వివరాలను పేట్ బషీరాబాద్ ఏసీపీ నరసింహరావు వెల్లడించారు .

వీడియో తీస్తుండగా గాయాలు … యూసుఫ్ పిల్లలతో సుభాన్లు ఫ్రెండ్లీగా ఉండేవాడు . ఈ నెల 15 న మధ్యాహ్నం 2 గంటలకు అధియా నను తన రూమ్ కి తీసుకెళ్లాడు . షేర్ చాట్ లో ఓ వీడియో తీసేందుకు ట్రై చేశాడు . ఈ క్రమంలో అధియాన్ కిందపడిపోయి తలకు గాయమైంది . స్పృహ కోల్పోయిన అధియాన్ చనిపోయాడని సుభాన్లు అనుకున్నాడు . దీంతో బాడీని మాయం చేయాలని ప్లాన్ చేశాడు . ఎవ్వరికీ అనుమానం రాకుండా పూర్తిగా టేప్ తో ప్యాక్ చేశాడు . అప్ప టికే స్పృహ కోల్పోయిన అధియాన్ శ్వాస ఆడక చనిపోయాడు . అధియాస్ డెడ్ బాడీని బ్యాగ్ లో ప్యాక్ చేసిన నిందితుడు .. అర్ధరాత్రి దాటిన తర్వాత శామీర్ పేట్ ఓఆర్ఆర్ పక్కన ఉన్న చెట్ల పొదల్లో పడేశాడు .

Kidnap and murder in Telangana ::

మహబూబ్నగర్ మర్డర్ కేసు మాదిరే అధియాన్ ఘటన జరిగింది . ఈ రెండు ఘటనల్లోనూ బాలుడిని హత్య చేసిన తర్వాతే కిడ్నాపర్ డబ్బు డిమాండ్ చేశాడు . 15 న అధియాన్ ను చంపేసిన సుభాన్లు .. 23 న తన ఇంటి ఓనర్ చాంద్ పాషాకి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు . ఫోన్ కాల్ లో అలర్ట్ అయిన పోలీసులు .. సీసీటీవీ కెమెరాలు ఫుటేజీలు , టెక్ని కల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు . సుభాన్షును అరెస్ట్ చేశారు . ఓఆర్ఆర్ చెట్ల పొదల్లో కుళ్లిన స్థితిలో ఉన్న అధియాన్ డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నా రు.స్పాట్ లోనే పోస్టమార్టం నిర్వహించి డెడ్ బాడీని తలిదండ్రులకు అప్పగించారు .

ఈ నెల 15 న కిడ్నాప్ , మర్డర్ శామీర్ పేట్ కి చెందిన సయ్యద్ యూసుఫ్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు . ఇతడికి నలుగురు పిల్లలు , మూడో కొడుకు అధియాన్ ( 5 ) ఈ నెల 15 న మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు . ఎంతకీ తిరిగి రాలేదు . దీంతో కుటుంబ సభ్యుల అధియాన్ కోసం వెతికినా జాడ తెలియలేదు . సాయంత్రం 6.30 కు శామీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఆ రోజు నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ యూసుఫ్ తిరుగుతూనే ఉన్నాడు .

ఈ క్రమంలో ఈ నెల 23 న ఉదయం యూసుఫ్ ఇంటి యజమాని చాంద్ పాషాకి ఓ వాట్సాప్ కాల్ వచ్చింది . అధియాను కిడ్నాప్ చేశానని , యూసుఫ్ నంబర్ ఇవ్వాలని అడిగాడు . తనకు
రూ .15 లక్షలు ఇస్తే అధియాను ప్రాణాలతో విడిచిపెడతానని చెప్పాడు . డబ్బులు ఇవ్వా ల్సిన ప్లేస్ గురించి మళ్లీ ఫోన్ చేసి చెప్తానని చెప్పాడు . దీంతో వాట్సాప్ కాల్ వివరాలను పోలీసులకు అందించారు . ఫోన్ నంబర్ శా మీర్ పేట్ దాబాలో పనిచేస్తున్న రాజు పేరుతో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు . రాజును అదుపులోకి తీసుకుని విచారించారు . రాజు ఇచ్చిన సమాచారంతో అదే దాబాలో వెయిట గా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన సుభాన్షు శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . యూసుఫ్ ఉంటున్న ఇంటి ఫస్ట్ ఫ్లోర్ లోనే సుభాన్షు ఉంటున్నట్లు గుర్తించారు . రాజుకు తెలియకుండా అతని ఫోన్లో వాట్సాప్ కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button