Tollywood news in telugu

అతడిని జన్మలో కూడా క్షమించను అంటూ ……సంచలన వాక్యాలు చేసిన కియారా…!

Kiara Advani Shocking Comments

Kiara Advani Shocking Comments  : టాలీవుడ్ లో కియారా అద్వానీ చేసిన సినిమాలు కొన్నే ఐన , తనకి తెలుగు ఫాన్స్ మాత్రం చాలానే ఉన్నారు. ‘వినయ విధేయ రామ ‘ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన కియారా , మల్లి తెలుగులో ఎలాంటి సినిమాలు చేయలేదు. కానీ ఈ మధ్యన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు నటించబోయే కొత్త సినిమాలలో కియారకు అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. 

ఇక ఈ భామ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం  బిజి బిజిగా గడుపుతుంది. తాజాగా ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. సినిమాల స్క్రిప్టులు వింటున్నానని , తనకు నచ్చిన కథ దొరికితే ఖచ్చింతంగా ఎవరి తోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. అలాగే తన ఫ్యామిలీ ఎపుడు తనకి సపోర్టుగా ఉంటుందని వెల్లడించింది.

ఇక మీడియా అతను బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో రిలేషన్ షిప్ గురించి  అడుగగా, అతని గురించి ఏ విషయం దాచాల్సిన అవసరంలేదని, మేము మంచి స్నేహితులం మాత్రమే అని చెప్తూ.. జనవరి నెలలో సిద్దార్థ తో కలిసి మాల్దీవులకు వెళ్లానని.గ్రాండ్ గా, అక్కడినుండి నూతన సంవత్సరాన్ని మొదలుపెట్టానని కియారా తెలిపారు.

మీడియా అతను మరో ప్రశ్న ఇలా అడిగాడు.. మిమ్మల్ని ప్రియుడు మోసగిస్తే.. ఏంచేస్తారు అని అడుగగా… అతడిని జన్మలో కూడా క్షమించను, అలాగే నమ్మను కూడా , తన మొహాన్ని చూడటానికి కూడా ఇష్టపడను అని సంచలన వాక్యాలు చేసింది.

అదే విదంగా  కియారా సినిమాల విషయానికి వస్తే… పోయిన సంవత్సరం కియారా నటించిన నాలుగు సినిమాలు విడుదల కాగా, ఈ సంవత్సరం కియారా నటించబోయే మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ మూడు సినిమాల విడుదల విషయంపై అధికారిక ప్రకటన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో బిజిగా ఉన్న కియారా.. తెలుగులో మాత్రం కాస్త జోరు తగ్గిందని చెప్పాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button