Raviteja Khiladi Movie Review :-

Movie :- Khiladi (2022) Review
నటీనటులు :- రవితేజ, డింపుల్ హయతి , మీనాక్షి చౌదరి , అర్జున్ , అనసూయ మొదలగు
సంగీత దర్శకుడు :- దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు :- రమేష్ వర్మ , సత్యనారాయణ కోనేరు
దర్శకుడు: – రమేష్ వర్మ
Story (Spoiler Free):-
ఈ కథ జైల్ లో ఉన్న గాంధీ (రవితేజ) నీ చూపిస్తూ మొదలవుతుంది. వెంటనే ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. పుట్టుకతో అనాధ అయిన గాంధీ నీ ఆడిటింగ్ కంపెనీ ఓనర్ అయిన రావు రమేష్ అధ్వర్యంలో పెద్దవుతాడు. అలా కాలం సాగగా గాంధీ తన ఎదురు ఫ్లాట్ లో ఉన్న చిత్ర (డింపుల్ హాయతీ ) నీ మొదటి చూపులోనే ప్రేమిస్తాడు.
ఇలా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడవగ అర్జున్ ఎంట్రీ తో సీన్ సీరియస్ గా మారుతుంది. అర్జున్ స్ట్రిక్ట్ CBI ఆఫీసర్. అనుకోకుండా రావు రమేష్ మనీ లాండరింగ్ కేస్ లో అరెస్ట్ అవ్వగా సొంత కుటుంబాన్ని చంపేసిన దోషిగా గాంధీని జైల్లో వేయడం జరుగుతుంది.
ఇంతకీ రావు రమేష నీ ఎలా మనీ లాండరింగ్ కేస్ లో అరెస్ట్ చేశారు ? గాంధీ నిజంగానే సొంత కుటుంబాన్ని చంపుకున్నాడ లేదా ఎవరైన కావాలని చేసిన పన్నగమ ? ఎవరు ఇదంతా చేశారు ఎందుకు చేశారు ? జైల్ లో ఉన్న గాంధీ బయటికి వచ్చాడు ? వచ్చాక గాంధీ ఎం ప్లాన్ చేశాడు ? అర్జున్ కి గాంధీ కి రావు రమేష్ మధ కనెక్షన్ ఎంటి ? వీటన్నిటి మధ్య మీనాక్షి చౌదరి పాత్ర ఎంటి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
Positives 👍:-
- సినిమా మొత్తంలో రవితేజ ఎనర్జిటిక్ నటన తప్ప పెద్దగా మాట్లాడుకోవడానికి ఎం లేదు.
- సినిమాటోగ్రఫీ విజువల్స్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
- మాస్ ప్రేక్షకులకి హాట్ సాంగ్స్.
Negatives 👎:-
- ప్లాట్ నరేషన్ ( కథ మరియు కథనం )
- దర్శకుడు ఎం చెప్పాలనుకున్నాడో క్లారిటీ ఇయ్యలేదు.
- లాజిక్స్ అస్సలు వేతకలేము.
- చాలా మటుకు సిల్లీ అనిపిస్తుంది.
Overall :-
మాస్ మహరాజ్ రవితేజ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మరియు మాస్ ప్రేక్షకులకి హాట్ సాంగ్స్ మినహా మిగిలినవన్నీ సినిమాలో ఫ్లాట్‌గా పడిపోతాయి మరియు ప్రేక్షకులను ఎక్కువ సమయం బోర్ కొట్టిస్టాయి. మిగిలిన పాత్రదారులు వారి పరిమిత స్క్రీన్ స్పేస్‌లో వారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి మరియు సినిమాటోగ్రఫీ బాగుంది. దర్శకుడు ఎం చెప్పాలనుకున్నాడో అర్థం కాదు. సినిమా అంతా లాజిక్స్ లేకుండా నడుస్తుంది. మాస్ లవర్స్ కి హాట్ సాంగ్స్ పెట్టేసి అలరించారు. ఎడిటింగ్ పర్వాలేదు. మ్యూజిక్ కూడా పెద్దగా ఆకట్టుకోదు.
రవితేజ కోసం ఒక్కసారి చూడచ్చు.
Rating :- 2.25/5