రికార్డులను కొల్లగొట్టిన KGF-2 టీజర్…!

భారతదేశ చలన చిత్ర పరిశ్రమలో ఒక మెరుపులా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన “KGF” చిత్రం.. ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా హీరో యష్ ఆటిట్యూడ్ ,యాక్టింగ్ ని డైరెక్టర్ ప్రశాంత్ నిల్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో సీక్వెల్ కు కూడా సిద్దమైన విషయం తెలిసిందే.
తాజాగా కేజిఎఫ్ 2 టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ చేసి.. రికార్డులను కొల్లగొట్టారు. ఈ టీజర్ విడుదలైన 12 గంటల్లోనే 20 మిలియన్ల పైగానే వ్యూస్ వచ్చాయి. ఇంకా ఈ టీజర్ కి 10 గంటల 30 నిమిషాల్లో రెండు మిలియన్ల లైకులు వచ్చాయి. సౌత్ ఇండియాలోనే 24 గంటల్లో అత్యధిక లైకులు సంపాదించుకున్న మొదటి టీజర్ గా రికార్డు సృష్టించింది.

అసలికి ఈ చిత్ర టీజర్ ని నేడు హీరో యశ్ జన్మదిన సందర్భంగా రిలీజ్ చేద్దామని డైరెక్టర్ ప్రశాంత్ ని ప్లాన్ చేశాడు .కానీ శుక్రవారం.ఈ టీజర్ లో కొన్ని సీన్స్ ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో శుక్రవారం రాత్రి 9:30 గంటలకు టీజర్ ని రిలీజ్ చేశారు.