health tips in telugu

తల్లి పాలు తల్లికి, బిడ్డకి ఎందుకు మంచిది?

benefits of breast milk::

benefits of breast milk

benefits of breast milk, అప్పుడే పుట్టిన నవజాత శిశువు యొక్క మొత్తం ఆరోగ్యానికి తల్లి పాలు చాలా ముఖ్యం. పిల్లల్లో తల్లి పాలు అనేవి ఒక ప్రాధమిక పోషకాహారం. తల్లి పాలలో బేబీస్ లో వచ్చే ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు అనేక వ్యాధులను తగ్గించడానికి సహాయపడే అవసరమైన పోషకాలకు ఒక మంచి సోర్స్. “ఇవి సులభంగా జీర్ణం అయినందున, ఎలాంటి  మలబద్ధకం, డయేరియా లేదా స్టమక్ అప్సెట్ లాంటివి ఏవి ఉండవు. జీవితంలో తరువాత వచ్చే డయాబెటీస్, అధిక కొలెస్ట్రాల్, మరియు ఇన్ఫ్లమేటరీ ప్రేగుల వ్యాధి వంటి ఇతర వ్యాధుల దాడులను నివారించడానికి తల్లి పాలు పిల్లలకు సహాయపడుతుంది.

benefits of breast milk::

* మీ శిశువు జీవితంలో మొదటి ఆరు నెలల్లో అవసరమైన అన్ని విటమిన్లు మరియు పోషకాలు తల్లి పాలలో ఉంటాయి. తల్లి పాలు శిశువు యొక్క మొదటి మూడు నెలలు చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లి పాలు మీ శిశువుని హానికరమైన వైరస్ లు మరియు బాక్టీరియాలకి వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుంది.

* ఇది శ్వాసకోశ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు, గాస్ట్రోఇంటేస్టినైల్ వ్యాధులు మరియు ఉబ్బసం, తామర మరియు అటోపిక్ డెర్మటైటిస్ వంటి అలెర్జీలకు వ్యతిరేకంగా ప్రొటెక్షన్ ని అందిస్తుంది. అంతేకాకుండా, ఇది మీ పిల్లల భవిష్యత్తులో ఊబకాయం యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

* తల్లి పాల వల్ల కేవలం పిల్లలకు మాత్రమే కాదు, తల్లులకి కూడా ప్రయోజనాలు ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ ఆక్సిటోసిన్ ఉత్పత్తిని పెంచుతుంది. “ఆక్సిటోసిన్ ఒక హార్మోన్ మరియు న్యూరోట్రాన్స్మిటర్”. డెలివరీ తర్వాత యుటిరస్ కాంట్రాక్షన్స్ మరియు అదనపు బ్లడ్ లాస్ కాకుండా ఈ హార్మోన్ సహాయపడుతుంది.

* తల్లి బిడ్డకి పాలు ఇవ్వడం వల్ల రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది మరోసారి గర్భం రాకుండా సహాయపడుతుంది. ప్రెగ్నేన్సీ తరువాత ఉండే బరువు తగ్గి మళ్ళీ మునుపటి శరీరాకృతిని పొందడానికి ఉపయోగాపడుతుంది.

మొదటి సారిగా తల్లి అయిన వారు బిడ్డకు పాలు ఇచ్చేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:

*కేలరీలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి వివిధ రకాల ఆహారపదార్ధాలు తీసుకోవాలి. పుష్కలంగా పండ్లు, కూరగాయలు, హోల్-గ్రైన్ బ్రెడ్ మరియు తృణధాన్యాలు తినడం అవసరం. ఎక్కువ వాటర్ తీసుకోవడం తప్పనిసరి.

“తల్లి బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఆల్కహాల్ మరియు స్మోకింగ్ అసలు చేయకూడదు. ఒకవేళ ఇలా చేస్తే తల్లి పాలు విషంగా మారే ప్రమాదం ఉంది మరియు బేబీ పాలు సరిగా తాగకపోవడం లేదా పూర్తిగా పాలు మానేయడం వల్ల పాలు రుచి బాడ్ గా ఉంటుంది.”

“తల్లి బిడ్డకు పాలు ఇచ్చేటపుడు ఒక లాక్సేటివ్ ఎఫెక్ట్ కలిగి ఉన్న స్పైసెస్, కూరగాయలు, మరియు పండ్లు తీసుకోకూడదు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button