Tollywood news in telugu
చాయ్ కావాలా సర్ చాయ్….. కీర్తి సురేష్ లేటెస్ట్ బిసినెస్ !

Keerthy Suresh తన నటనతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ చాయ్ అమ్మడమేంటని అనుకుంటున్నారా. తన లేటెస్ట్ సినిమా ‘మిస్ ఇండియా’ ప్రమోషన్ కోసం టీ అమ్మింది.
అసలు విషయానికి వస్తే, కీర్తి ప్రస్తుతం నితిన్ సరసన ‘రంగ్ దే’ సినిమాలో నటిస్తుంది. అలాగే మహేష్ సరసన కూడా చేస్తున్న విషయం మీకు తెలిసిందే.
ఇక ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం ‘మిస్ ఇండియా’ గురించి చెప్తూ విదేశాల్లో ఎక్కువగా కాఫీ తాగుతారు, మనదేశం లో ఐతే టీ తాగుతారు, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సినిమాలో ఒక ఇండియన్ అమ్మాయి ఫారెన్ కి వెళ్లి చాయ్ బిసినెస్ స్టార్ట్ చేస్తుంది.
ఈ సందర్బంగా ఆ ఇండియన్ మహిళకు ఎదురైనా సవాళ్ళే ఈ సినిమాలో చాల డిఫరెంట్ గా ఉంటాయని తెలిపింది. ఈ సినిమా కూడా నవంబర్ 4న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.