keerthi Suresh is getting married : కీర్తి సురేష్ పెళ్లి అంటూ …. షోషల్ మీడియాలో వైరల్… నిజమే అంటున్న…!

keerthi Suresh is getting married : సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, హీరోయిన్ కీర్తి సురేష్ ప్రేమలో పడ్డారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. వీళ్లద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. మంచిరోజులు వచ్చాక ఇండస్ట్రీ లో వీరి పెళ్లి ముందు జరుగుతుందని టాక్ .
ఈ వార్తల గురించి తెలుసుకున్న కీర్తి తల్లిదండ్రలు అదంతా ఏమిలేదని తేల్చేసారు. కానీ బయట మాత్రం జరిగేది మరోలా ఉంది. కీర్తి బర్త్ డే కి అనిరుధ్ అటెండ్ కావడం, వీరు ఒకరిమీద ఒకరు చెయ్ వేసుకొని ఫోటోలకు పోజులివ్వడం చూస్తుంటే, వీరి మధ్య ఎదో ఉందని చూసినవారు అనుకుంటున్నారు.
అటూ కోలీవుడ్ వర్గాలు ఈ విషం నిజమే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంతకముందు కూడా సింగర్ జోనితా గాంధీతో, అనిరుధ్ రిలేషన్షిప్లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఇంకా చెన్నైకు చెందిన ఒక వ్యాపారవేత్తను, కీర్తి సురేష్ పెళ్లాడబోతున్నారని కూడా షోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి.
కానీ ఇప్పటివరకు వీటిలో ఏది ముందుకు సాగలేదు. ఇప్పుడు అనిరుధ్, కీర్తి సురేష్ పెళ్లి అంటూ వార్తలు రావడంతో , ఈ విషయంపై వారు స్పందిస్తేనే తప్ప నిజం బయటపడేలా లేదు.