కార్తీక శనివారం శని అనుకూలతలు
ఈరోజున కార్తీక శనివారం అత్యంత శుభ ప్రదమైన రోజు. కార్తీక మాసం లో ప్రతి రోజు పుణ్యప్రదమే.
కార్తీక మాసం శనివారం రోజున మనం చేసే చిరు పరిహారాలు మనకు ఏలినాటి శని , అష్టమ శని , అర్ధఅష్టమ శని వంటి దోషాలు దూరం చేస్తుంది.
కార్తీక మాసం ను మించిన మాసం లేదు ఈశ్వరుని మించిన దైవం లేదు అన్నది పెద్దల మాట.
కార్తీక మాసం శనివారాల్లో వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల శని అనుకూలత కలుగుతుంది , దీనికొక కారణం కూడా ఉన్నది వారం మిగతా ఆరు రోజుల్లో చేసిన ఆరాధనకి సమాన ఫలితం శనివారం నాటి వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల లభిస్తుందని సాక్షాత్ శ్రీ వారే శని భగవానునికి వరం ఇచ్చారు అని ప్రతీతి.
ఈరోజున విష్ణు మూర్తి ఆలయంలో ఉన్నటువంటి త్రిమూర్తి స్వరూపం అయిన
రావి చెట్టుకి ప్రదక్షణలు చేసి రావి చెట్టు మొదట్లో ఆవు నేయి దీపం వెలిగించడం వల్ల శని అనుకూలత కలుగుతుంది.
శని భగవానునికి 19ప్రదక్షణలు చేయడం శనివారం నాడు అత్యంత శుభ ఫలితాలు ఇస్తుంది.
మరిన్ని విషయాలు రాబోయే కథనాల్లో తెలుసుకుందామా మరి