devotional information in telugu

నేటి కార్తీక సప్తమి విశేషాలు

ఈరోజున కార్తీక శుద్ధ సప్తమి మరియు బుధవారం. ఇది అత్యంతావశ్యకమైన రోజు. సప్తమి తిధి సూర్య నారాయణ మూర్తికి , బుధవారం నారాయణుని కి అత్యంత ప్రియమైన రోజు దీన్నే భాను సప్తమి లేదా ఆర్క సప్తమి అంటారు.

ఈరోజున ఉదయం శుద్ధిగా స్నానం చేసి దీపారాధన చేసి సాక్షాత్ నారయణ స్వరూపం అయిన సూర్య నారయణ మూర్తిని అర్చన చేసి నమస్కార ఆర్ఘ్యపాద్యాలతో సేవించి గోధుమ నూక తో పాయసం చేసి సూర్యునికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పది మందికి పంచి మనం సేవించడం మంచిది. ఈ పాయసం మెత్తగా ఉండటం అన్నది నియమం.దీనికి కారణం ఆయనకు పళ్ళు లేక పోవడమే.

నీటిలో నానబెట్టిన గోధుమలను బెల్లం తో కలిపి ఆవు కు నివేదన చేయడం , సూర్య భగవానుని ఆరాధన వల్ల నవగ్రహాల అనుకూలతతో పాటు హరిహరుల అనుగ్రహము కలుగుతుందని పరిహార శాస్త్రం చెబుతుంది.
ఓం ఆదిత్యాయ నమః
ఓం నమో నారాయణాయ

Read  తెలుసా ఎందుకో! ముచ్చటగా మూడు రోజులు జరుపుకొనే సంక్రాంతి పండగ!!!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button