కార్తీక పౌర్ణమి ఆరాధన క్రమం
కార్తీక పౌర్ణమి రోజున ఆచరించ వలసిన విధి క్రమం
కార్తీక పౌర్ణమి మహా పర్వదినం భక్తులకు మరో మహా శివరాత్రి. ఈ నెలలో అత్యుత్తమ పర్వదినం. ఈరోజు చేయాల్సిన పూజా క్రమం తెలుసుకుందామా ?
ఉదయానే అందుబాటులో ఉన్న నది నదాల్లో కాని, కూపముల యందుకాని, సముద్రం లో కాని స్నానంచేసి హరిహరుల ఆలయాల్లో దీపం వెలిగించి సంకల్పం చేసుకోవాలి. తర్వాత ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయాన దేవాలయం లో కాని, పూజా మందిరంలో కాని, తులసి కోట వద్ద కానీ ఉసిరి దీపాలు, 365వత్తులు, సహస్ర వత్తులు, లక్షకాని , కోటి వత్తులు కాని పరమాత్మ కి ప్రజ్వలన చేస్తారు.
సువాసిన్యాదులు తమ సౌభాగ్యం కోసం జలములయఁదు అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి వదులుతారు.నేడు ధాత్రి అనగా ఉసిరి చెట్టుని నారాయణ స్వరూపం గా, తులసిని లక్ష్మి స్వరూపం గా భావించి ప్రదక్షిణలు చేస్తారు, కళ్యాణం కూడా జరిపిస్తారు.
వీలయిన వారు త్రిమూర్త్యాత్మక.స్వరూపం అయిన అన్నవరపు సత్యదేవుని వ్రతం ఈరోజు ఆచరిస్తారు.ఇది ఉత్తమోత్తమ ఫలితం ఇస్తుంది. కేదారేశ్వర వ్రతంను ఆచరించే వారు ఉన్నారు. ఏది చేయాలన్నా అచంచలమైన భక్తి ప్రధానం
ఓం నమః శివాయ