కార్తీక మంగళవారం ఆరాధన
ఈరోజు కార్తీక బహుళ పంచమి, మంగళ వారం.
కార్తీక మాసం అని ఈ మాసానికి ఎలా పేరు వచ్చింది అంటే, చంద్రుడు పౌర్ణమి తిధి యందు ఉన్న నక్షత్రంను అనుసరించి ఆయా మాసాలకు ఆయా పేర్లు వస్తాయి. కృత్తికా నక్షత్రం పౌర్ణమి తిధి యందు రావడం వల్ల కృత్తికలు పోషించిన సుబ్రమణ్య స్వామి పేరు మీద ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు. ఇక కార్తీక మాసం సుబ్రమణ్య ఆరాధన చేయాలి. ప్రత్యేకంగా స్వామి వారి ఆరాధన చేయక పోయినా ఈ మాసం లో చేసే దీపారాధన సాక్షాత్ అగ్ని స్వరూపం అయిన , అగ్ని గర్భుని గా పేరు గాంచిన సుబ్రమణ్య ఆరాధన అవుతుంది.
సుబ్రమణ్య స్వామి శక్తిని ఆయుధం గా , జాతి వైరం కలిగిన నెమలి పాములను వాహన పరివారం గా, కోడి పుంజు ను విజయ ధ్వజం గా కలిగి ఉంటాడు. సుబ్రమణ్య స్వామి జ్ణాన శక్తి స్వరూపుడు కావున నే ప్రణవ రహస్యం ను కూడా బ్రహ్మ తో సహా శివుని కి ఉపదేశం చేసి కుమార గురువు అయ్యాడు. అటువంటి స్వామి కి ఆరు ప్రమిదల్లో ఆరు వత్తులు వేసి నేయి, నువ్వుల నూనె తో కలిపి దీపం వెలిగించిన ఆ జన్మ పాపాలు నశించి కుజ గ్రహ అనుగ్రహము లభించి సమస్త దోష నివృత్తి కలుగుతుంది. వీలయితే చివరి మంగళ వారం కావున ఉపవాసం ఉన్న మరింత శుభం.
ఓం వహ్ని గర్భాయ నమః