telugu gods devotional information in telugu

నేటి ఏకాదశి యొక్క ప్రత్యేకత

నేటి విశేషం గురించి కొన్ని విషయాలు.
నేడు కార్తీక శుద్ధ ఏకాదశి . . ఉత్తాన ఏకాదశి అంటారు. పాలకడలి లో పడుకున్న నారాయణుడు నిద్ర నుండి మేల్కొని మాయాలీలా విన్యాసాలచేత ప్రపంచాలను స్థితి చేయు స్థిత ప్రజ్ణుని సేవించి కీర్తించ తగిన రోజు.

ఈ ఏకాదశి గురించి బ్రహ్మ దేవునికి నారద మహర్షి చెప్పిన మాట ఏమంటే ఈ ఏకాదశి పాపాలను హరిస్తుంది వెయ్యి అశ్వమేధయాగాలు, వంద రాజసూయ యాగాలు చేసిన ఫలితం వస్తుంది.ఏకాదశి ఉపవాసం వల్ల ధన, ధాన్య సంపదలు సిద్ధిస్తాయి. పుణ్యక్షేత్రం లో చేసే యజ్ణ యాగాలు , వేద పఠనం వల్ల కలిగే పుణ్యానికి కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.

ఈరోజున ఒక్కరికి చేసే అన్నదానం గంగా నది తీరాన గ్రహణ సమయం లో కోటి మందికి చేసిన అన్నదాన ఫలితం వస్తుంది.స్వామి వారికి ఇచ్చే నీరాజనం కూడా ఆప మృత్యు దోషాన్ని హరిస్తుంది.
ఓం నమో నారాయణాయ

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button