కార్తీకదీపం ఈరోజు
Karthika deepam september 25 episode

రోజు ఎంతో ఉత్కంఠగా సాగిపోతున్న కార్తీకదీపం సీరియల్.. అనూహ్యమైన మలుపులు తో.. నటీనటుల హావ భావాలతో.. ప్రేక్షకుల్ని కంట తడి పెట్టిస్తుంది ముందుకు దూసుకుపోతోంది..
కార్తీక్, హిమ తో నువ్వు అనాధ వు అన్న విషయం చెప్పడంతో, పసి మనసు తట్టుకోలేక పోతుంది. అలాగే జ్వరం వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం పదే పదే బాధపడుతూ తనకు ఎవరూ లేరని అనుకోవడం మనకు తెలిసిందే.. Read also Karthika deepam september 24 episode
ఈరోజు సీరియల్ మొదలవగానే.. Karthika deepam september 25 episode
నీతో మాట్లాడాలి అని దీపం కిందకు రమ్మని పిలుస్తాడు కార్తీక్.. నువ్వు హిమ ను ఎప్పటికీ కలవకూడదు.. ఎప్పటికీ దగ్గరయ్యే ప్రయత్నం చేయకూడదు.. అని ఆంక్షలు పెడతాడు కార్తీక్..
కట్ చేస్తే.. సౌందర్య , వంటలక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంతలో కార్తీక్ వాళ్ళ అమ్మ కు (సౌందర్య) కు ఫోన్ చేస్తాడు.
ఫోన్ చేసిన కార్తీక్ ఇలా అంటాడు’నువ్వు ఎక్కడున్నావో నాకు తెలుసు మమ్మీ.. ఇక్కడ నా కూతురు జ్వరంతో బాధపడుతున్న.. దాని గురించి ఆలోచించకుండా, నువ్వు వంటలక్క ఇంటికి వెళ్లావు. అంటే నీకు నా కూతురు కంటే వంటలకే నీకు ఎక్కువ. నా కూతురు ఏమైపోతే నీకు ఎందుకు అనుకుంటున్నావు కదా మమ్మీ. అని అంటాడు కోపంగా.. తర్వాత కొద్దిగా నెమ్మదించి.. సరే మమ్మీ అదంతా నీ ఇష్టం. కాకపోతే ఆ వంటల అక్క ని మళ్ళీ హిమ కు దగ్గర చేయాలని మాత్రం ప్రయత్నించకు. మళ్లీ ఆ వంటలక్కను మన మన ఇంటికి తీసుకు రావద్దు..
హిమ కు జ్వరం ఎక్కువగా ఉందని, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని అనుకుంటున్నాం అని.. కానీ ఈ విషయాన్ని దీప కు చెప్పి ఇంటికి మాత్రం తీసుకు రావద్దని ఖచ్చితంగా చెప్తాడు డాక్టర్ బాబు. దాంతో ఫోన్ పెట్టేసి కంగారుగా ఇంటికి బయలు దేరుతున్న సౌందర్యని దీప ఇలా ప్రశ్నిస్తుంది ‘ఏమైంది అత్తయ్య ఎందుకంత కంగారు గా బయలుదేరి వెళ్తున్నారు..హిమ కు ఏమైంది.. నా కూతురికి ఆరోగ్యం ఎలా ఉంది అని ప్రశ్నిస్తోంది? అందుకు సమాధానంగా సౌందర్య ‘హిమ కు జ్వరం ఎక్కువగా ఉంది అందుకే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అనుకుంటున్నాడు కార్తీక్’ అని సౌందర్య అంటుంది.
వెంటనే నేను వస్తాను అత్తయ్య అని దీప కూడా బయలుదేరుతుంది. కానీ సౌందర్య దీప వద్ద నివారిస్తుంది.. నువ్వు రావద్దు ఇప్పటికే కార్తీక్ నీ మీద కోపంగా ఉన్నాడు అని అంటుంది. నువ్వు వస్తే కార్తిక్ ఆవేశం కట్టలు తెంచుకుని నేను అనరాని మాటలు అనవచ్చు.. కాబట్టి ముందు నేను వెళ్తాను. వెళ్లి ఎప్పటికప్పుడు హిమ ఆరోగ్యం ఎలా ఉందో ఆస్పత్రినుంచి నీకు తెలియజేస్తాను. అని అంటుంది సౌందర్య.
సౌందర్య దీప తీసుకురాకుండా ఒంటరిగా వచ్చినందుకు, కార్తీక్ ‘థాంక్స్ మమ్మీ’ అంటాడు. అందుకు సౌందర్య కార్తీక్ ను ఇలా కో పడుతుంది ‘నోరు ముయ్యి రా స్టుపిడ్’ ముందు హిమ ఎలా ఉందో చెప్పు..
నిజంగా నా కూతురు గురించి నీకు అంత కంగారు ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని వదిలేసి నువ్వు వంటలక్క ఇంటికి ఎలా వెళ్తావు మమ్మీ అని కార్తిక్ ప్రశ్నిస్తాడు.
దానికి జ్వరం బాగా ఎక్కువైంది. నిద్రలో కూడా అమ్మ అమ్మ అనే కలవరిస్తోంది అని అంటాడు కార్తీక్. జ్వరంతో బాధపడుతున్న పిల్లల చూడలేక అసలు నిజం చెప్పాలనుకుంటుంది సౌందర్య. కానీ కార్తీక్ ఎక్కువగా కంగారు పడుతుండడంతో, నువ్వు బయటికి వెళ్ళు కార్తీక్, హిమ ను నేను చూసుకుంటాను.. అని కార్తీక్ ను బయటకు పంపిచేస్తుంది.. అలా కార్తీక్ బయటికి వెళ్లడంతో హిమ తో మనసు విప్పి మాట్లాడుతుంది. అందులో భాగంగానే తాను చేసిన తప్పును హిమ కు వివరించి చెబుతుంది. దీప ని కన్న తల్లి అని, అలాగే కార్తీక్ నీ కన్న తండ్రి అని నిజం చెప్పేస్తుంది సౌందర్య.. మీ అమ్మను నాన్నను కలపడానికి నిన్ను మీ అమ్మ పొద్దున్నుంచి తీసుకు వచ్చేసాను అని చెప్తుంది.
నీకు అన్ని బంధుత్వాలు బంధాలు ఉన్నాయి అని.. విడిపోయిన అమ్మి అమ్మానాన్నల్ని నువ్వు మాత్రమే కలపగలవని.. అది నీ వల్లే సాధ్యమవుతుందని నిన్ను తీసుకు వచ్చాను అని అంటుంది. ఎప్పటికైనా నువ్వు నాతో కాదు అన్న నిజాన్ని తెలుసుకో.. మీ నాన్న ప్రేమ నువ్వు అర్థం చేసుకో.. అని అంటుంది. ఒక చిన్న అపార్ధం వల్ల మీ నాన్న మనసు అగాధం లోకి వెళ్ళిపోయింది.. కాబట్టి మీ అమ్మను నాన్నను నువ్వు మాత్రమే కలుగగలవు అన్న నమ్మకం నాకు ఉంది అని అంటుంది సౌందర్య.
అటు తాను అనాధ కాదని ఉన్న నిజం తెలుసుకున్న హిమ ఎంతగానో సంతోషిస్తుంది.. నువ్వు చెప్పేది నిజమా నానమ్మ నేను అనాధను కాదా.. వంట లక్కే మా అమ్మ..? అని సంతోషంతో సౌందర్యం మళ్లీమళ్లీ ప్రశ్నిస్తుంది హిమ.
అలాగే నిజం తెలుసుకున్న హేమ కార్తీక్ దగ్గరికి వెళ్తుండగా, సౌందర్య హిమను ఆపుతుంది. ఏంటి నానమ్మ అంటే, సౌందర్య ఇలా అంటుంది..’నువ్వు దీప కూతురివి అని తెలిస్తే కార్తీక్ నిన్ను కూడా దూరం చేసుకుంటాడు. నువ్వు ఎప్పట్లాగానే ఉండు లేదంటే మీ అమ్మానాన్నలను కలపలేము. అలా ఉంటేనే మీ అమ్మ నాన్న లని కలపగలం.
వంటలకే మీ అమ్మ అన్న విషయం నీకు తెలుసు అని మీ నాన్న కు తెలియకూడదు. ఇలా సౌందర్య హిమను కార్తీక్ కి నిజం చెప్పకుండా ఆపేస్తుంది.
ఎన్నో ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు నింపుకున్న కార్తీకదీపం సీరియల్ కొనసాగుతోంది..