ఈరోజు కార్తీకదీపం!
Karthika deepam september 24 episode

Karthika deepam september 24 episode : అదిరిపోయే ట్విస్టులతో.. నటీనటుల హావ భావాలతో.. ప్రేక్షకులను ఆద్యంతం కంటతడి పెట్టిస్తున్న కార్తీకదీపం సీరియల్.. ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది.. హిమ కు తను కాదా అన్న విషయం తెలియడం.. దాంతో ఇంటి బయట కళ్ళు తిరిగి పడిపోవడం.. కార్తీక్ ను డాక్టర్ బాబు అని పిలవడం.. ఇంట్లోకి రావడానికి మొండికేయడం..ఇలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో కార్తీకదీపం సీరియల్ కొనసాగుతోంది..
ఈరోజు సీరియల్ మొదలవ్వగానే..
హిమ కి జ్వరం రావడంతో.. దీపా సౌందర్య ఇద్దరు కలిసి బయట మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో డ్రైవర్ అంజి అక్కడికి వస్తాడు..’అమ్మ.. పాపకు బాలేదని, చూడడానికి డాక్టర్ బాబు ఆయన స్నేహితురాలిని తీసుకు రమ్మని చెప్పారు..’ అని సౌందర్య తో అంటాడు. ఇప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్లి డాక్టర్ అమ్మను తీసుకొని వస్తానమ్మా అని అంటాడు. అప్పుడు దీప తన మనసులో ఇలా అనుకుంటుంది.’ఇప్పుడు అది ఎందుకు.. అది రావాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అని తన మనసులో అనుకుంటుంది. ఇంతలో సౌందర్య సరే నువ్వు వెళ్ళు అని డ్రైవర్ని పంపిస్తుంది. కానీ సౌందర్య తన మనసులో ఇలా అనుకుంటుంది..’ ఇప్పుడు కనుక మౌనిత ఇంటికి వస్తే దీపకు మౌనిత కు మధ్య గొడవ జరగవచ్చు.. అలా జరగకుండా ఉండాలి అంటే మౌనిక నేను ఇంటికి రానివ్వకుండా చెయ్యాలి..’ అని తన మనసులో అనుకుంటుంది సౌందర్య.
కట్ చేస్తే..
మౌనిత ఇంటికి వెళ్లి అంజి, డాక్టర్ అమ్మ డాక్టర్ అమ్మ అని తలుపు ని తడుతూ ఉంటాడు.. లోపల ఉన్న మౌనిత, అంజి గొంతు విని ఏంటి ఈ టైం లో వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని భయ పడిపోతుంది.. నా గురించి ఏమైనా గుడికి నిజం తెలిసి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండి పోతుంది.. అయినా వాడు ఇంతకీ నన్ను చూడలేదు కదా కనుక వాడు నన్ను గుర్తుపట్టే అవకాశమే లేదు అని తనకు తాను సర్ది చెప్పుకుంటుంది.. ఇంట్లోనే ఉండి కూడా అంజి ఎంతసేపు డోర్కొట్టిన తీయదు మౌనిత.. అంజి చాలా సేపు డాక్టర్ అమ్మ.. డాక్టర్ అమ్మ.. అని పిలుస్తూ డోర్ కొట్టి వెళ్ళిపోతాడు..
దీప మాత్రం హిమ దగ్గరే ఉంటుంది..హిమ ను తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తల నిమురుతూ ఉంటుంది.. కాసేపటికి హిమ స్పృహ వస్తుంది.. స్పృహ రాగానే చూసావా వంటల అక్క నేను కూడా మీలాగే మీ ఇంటికి ఏమి కాను అని అంటుంది.. అప్పుడు వంటలక్క ఇలా అంటుంది..’అలా అనొద్దు హిమ.. నీకు ఇకపై అమ్మాయి అయినా నాన్న అయినా లేదా ఫ్రెండ్ అయినా కూడా అని మీ డాడీ నే అని అంటుంది.’. దీపు ఎంత చెప్పినా కూడా హిమ మాటల్ని పట్టించుకోదు.
ఇంతలో సౌందర్య ఇంకో డాక్టర్ ని పిలిపిస్తుంది. ఈ డాక్టర్ ను అంజి తీసుకొస్తాడు.. వేరే డాక్టర్ ను చూసి కార్తీక్ సౌందర్యం ను ఇలా ప్రశ్నిస్తాడు..’ఏంటమ్మా ఈ డాక్టర్ ని పిలిపించారు అని అడుగుతాడు..’మౌనిత ఇంట్లో లేదుట.. మన అంజి మౌనిత ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి కొట్టి తిరిగి వచ్చేశాడు.’ ఇప్పుడు వచ్చిన డాక్టర్ కార్తీక్ ను చూసి, మీరే పెద్ద డాక్టర్ కదా మీరు నన్ను ఎందుకు పిలిపించారు అని ప్రశ్నిస్తుంది.. ఇప్పుడు నేను ఏమి చూడలేని పరిస్థితిలో ఉన్నాను మీరు వెళ్లి చూడండి అని అంటాడు కార్తీక్. హిమ ను చూసి.. మందులు రాసి.. తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ చెప్పి డాక్టర్ బయలుదేరుతుంది. అలా డాక్టర్ వెళ్ళగానే అని కార్తీక్ దీప తో ఇలా అంటాడు..’నీతో ఒకసారి మాట్లాడాలి వంటలక్క ఒక్కసారి కిందకు వస్తావా అని పిలుస్తాడు..’ ఈ టైంలో పిలుస్తున్నాడు ఏంటి దీపతో ఏం మాట్లాడతాడో అని సౌందర్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది.
కట్ చేస్తే..
కార్తీక దీపాలు ఇద్దరు కూడా కిందకి వస్తారు.. చూడు దీప.. నువ్వు హిమ ను చూడక్కర్లేదు.. నా కూతుర్ని నేను చూసుకుంటాను.. మీ వల్లే నా కూతురు నాకు కాకుండా పోయింది.. నన్ను క్షమించు దీప.. నీ జీవితం లాగా నా జీవితం చేసుకోవాలని నేను అనుకోవట్లేదు.. నా జీవితంలో ఉన్నది ఒక్కగానొక్క నా కూతురే.. ఇకపై నా కూతుర్ని చూడడానికి నువ్వు ఇక్కడికి రానక్కర్లేదు అని అంటాడు కార్తీక్..
ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఆసక్తికరమైన.. కథ కంటతడి పెట్టించే నటీనటుల నటన తో కార్తీక దీపం కొనసాగుతోంది..