Karthika deepam september 23 episode

Karthika deepam september 23 episode :: ఆసక్తికరమైన కథనంతో .. ఆద్యంతం బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న .. సీరియల్ కార్తీకదీపం. హిమ అనాధ అని తెలిసినప్పటి నుంచి, సీరియల్ ఆసక్తికరంగా మారింది. నటీనటులు, ప్రేక్షకుల చేత కూడా కంటతడి పెట్టిస్తున్నారు.
ఈరోజు సీరియల్ మొదలవగానే.. Also Check for Karthika deepam september 22 episode
హిమ అనాథ అని తెలుసుకున్న తర్వాత బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. హిమ వెనకాలే కార్తీక్, దీప, సౌందర్య అందరూ పరిగెత్తుకొని వస్తారు. హిమ ను ఇంట్లో కి రమ్మని కార్తీక్ బతిమాలుతాడు.. అయినా హిమ ఏ మాత్రం తగ్గదు. లోపలికి రావడానికి అంగీకరించదు. దాంతో కార్తీక్ సౌందర్యం తో బాధగా ఇలా అంటాడు..’అమ్మ నువ్వైనా చెప్పమ్మా..హిమ ను నేను ఎంత అపురూపంగా పెంచుకున్నానో.. కన్న తండ్రి మాత్రమే కాదు పెంచిన తండ్రి కూడా కన్న తండ్రి లాగా అపురూపంగా చూసుకోగలడు అని చెప్పమ్మా’ అని అంటాడు. సౌందర్య.. హిమ కి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.. ఏమే నీకు మేము అందరం లేమా అని అంటుంది.’ ఇంతలో కార్తిక్ మళ్లీ వంటలక్క వైపు తిరిగి..’ వంటలక్క నువ్వైనా చెప్పు..హిమ అంటే నాకు ఎంత ఇష్టమో.. చెప్పమని దీపను రిక్వెస్ట్ చేస్తాడు.. ఎప్పుడు ఎంత మంచి చేసినా దీపం మీద చిరాకు పడే కార్తీక్ హిమ కోసం వంటలక్క ను రిక్వెస్ట్ చేస్తాడు..
వెంటనే దీప హిమను దగ్గరకు తీసుకుని.. చూడు హిమ.. ఇక్కడ నీకు నానమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, తాతయ్య అందరూ ఉన్నారు.. లేనిదల్లా అమ్మ ఒక్కతే.. మీకు అందరూ ఉన్నారు కదా అమ్మ.. చక్కగా చూసుకుంటారు కదా అని ఇంట్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలో హిమ నాకు ఏమీ అర్థం కావట్లేదు వంటలక్క.. అంతా చీకటిగా ఉంది అంటూ కళ్లు తిరిగి పడిపోతుంది.. కింద పడిపోయింది మన పట్టుకుని కార్తీక దీపలు ఇద్దరు కలసి ఇంట్లోకి తీసుకు వస్తారు..హిమకు జ్వరం వచ్చి ఒళ్ళు కాలి పోతూ ఉంటుంది.. వెంటనే కార్తీక్
శతస్కోప్ తెచ్చి పరీక్ష చేయబోతాడు.. వెంటనే హిమ లేచి కూర్చుంటుంది. లేచి కూర్చుని డాక్టర్ బాబు .. మీరు నన్ను టెస్ట్ చెయ్యొద్దు ఉంటుంది. ఆ మాటకే కార్తిక్ నిర్ఘాంత పోతాడు. ఇంతలో దీప డాక్టర్ బాబు టాబ్లెట్స్ రాసివ్వండి నేను వెళ్ళి తీసుకు వస్తాను అంటుంది.. వద్దు అక్కర్లేదు నా కూతుర్ని నేను చూసుకోగలను అంటూ కూతురు ని బలవంతంగా పైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాడు కార్తీక్. హిమ నేను రాను అని మొండి చేస్తూ ఉంటుంది. ఏ లోపు కార్తిక్ కి మళ్లీ కోపం వచ్చి.. సౌందర్య ని దీపని.. ఇలా అంటారు ‘ఆఖరికి నా కూతురు నన్ను డాక్టర్ బాబు అని పిలిచే ఎలా చేశారు కదా’ దానికి సమాధానంగా సౌందర్య నువ్వు ముందు వెళ్లి పిల్లని పైన దింపి రా.. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అంటుంది.. కార్తీక్ హిమ ను పైకి తీసుకు వెళ్తాడు..
ఇప్పుడు ఇక దీపపు సౌర్య గుర్తొస్తుంది.. ఎవరికోసం ఇల్లంతా వెతుకుతుంది. ఇంతలో సౌందర్య అక్కడికి వస్తుంది. ఎవరి గురించి కనుక్కోవడానికి వారణాసి కి ఫోన్ చేస్తుంది.. వారణాసి ద్వారా సౌర క్షేమంగా ఇంట్లోనే ఉంది అని తెలుసుకున్న దీప కొద్దిగా ఊపిరి పీల్చుకుంది.. ఇంతలో సౌందర్య అక్కడికి వచ్చి.. జరిగింది అడిగి తెలుసుకుంటుంది. ఏంటో పరిస్థితులు పరిణామాలు ఏంటో అర్థం కావట్లేదు అంటుంది సౌందర్య.
వెంటనే దీప ఆవేశంతో.. ఏం అర్థం కావాలి అత్తమ్మ..నన్ను ఒక పిచ్చి మొక్కలా గా తీసి పారేశారు మీ అబ్బాయి.. ఆ రోజు మా ఇద్దరిని కలకాలం ఉద్దేశంతో నా పొత్తిళ్లలో నుంచి నా బిడ్డను తీసుకుని వచ్చేశారు.. కానీ అది నా కూతురు అని చెప్పటానికి మీకు ఎనిమిది ఏళ్ళు పట్టింది.. ఇక మీరు మమ్మల్ని ఏం కలిపారు అత్తమ్మ మమ్మల్ని అని దీప అడుగుతుంది.. ఆ ప్రశ్నకి సమాధానం లేక సౌందర్య అలాగే నిలబడి పోతుంది..తల్లి నుండి బిడ్డను వేరు చేసి నీ దగ్గరకు తీసుకొచ్చి పెంచుకోవడం వల్ల చివరకు అది తల్లి తండ్రి లేని ఒక అనాధగా మిగిలిపోయింది. అని తన బాధను వ్యక్తం చేస్తుంది దీప.
కట్ చేస్తే…
శ్రావ్య దీపు గాడికి పాలు కలుపుతువుంటుంది. ఆదిత్య దీపు గాడు లేస్తాడేమో త్వరగా తీసుకెళ్లి పాలు ఇవ్వు అంటాడు. అందుకు శ్రావ్య గతం గుర్తు చేసుకుంటూ.. బాబు గారు కూడా హిమకు ఇలాగే పాలు కలిపేవారు కదా.. నేను కానీ అత్తమ్మ కానీ.. చూస్తాము అన్న కూడా ఒప్పుకునేవారు కాదు.. ప్రతి పని ఆయన దగ్గరుండి స్వయంగా చూసుకునేవారు.. అంత ప్రేమగా పెంచుకున్నారు.. కానీ చివరకు హిమ మాత్రం అవన్నీ మర్చిపోయి ఎప్పుడు జరిగింది దాని గురించే మాట్లాడుతోంది ..అని అంటుంది.
ఇందుకు సమాధానం గా కార్తీక్ కేక్ ఇలా అంటాడు..’నువ్వు అనాధ అని చెప్పమని నా ఉద్దేశం కాదు.. కాకపోతే తల్లి లేదు కదా తండ్రి కూడా లేడు అని తెలిస్తే సరే వీళ్ళు నన్ను పెంచుకున్నారు అని అర్థం చేసుకుంటుంది అని అనుకున్నాను కాని తను ఇలా అపార్థం చేసుకుని మానసికంగా క్రుంగి పోతుందని అనుకోలేదు అంటాడు..
ఇక ఇప్పుడు ఈ కార్తీకదీపం సీరియల్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఆసక్తికరంగా వేచిచూడాల్సిందే..
కార్తీకదీపం కొనసాగుతోంది…