Karthika deepam september 21 episode

karthika deepam september 21 episode : అనూహ్యమైన మలుపులతో కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఉత్కంఠభరితమైన మలుపులతో తనదైన శైలిలో దూసుకెళుతోంది. కార్తీకదీపం సీరియల్ ఈరోజు మొదలవగానే…. Check here for karthika deepam september 17 episode
సౌందర్య, ఆదిత్య, శ్రావ్య తో పాటు వంటలక్క కూడా హిమను ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. ఎక్కడికి వెళ్లావు..?
ఎందుకు వెళ్లావు..?? ఇంట్లో చెప్పకుండా వెళితే అందరూ ఎంత కంగారు పడతారు నీకు తెలియదా..?? అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇంతలో డాక్టర్ బాబు అక్కడికి వస్తాడు. హిమ ను చూసిన డాక్టర్ బాబు కొద్దిగా ఊపిరి పీల్చుకుని, అమ్మ హిమ.. చెప్పకుండా ఎక్కడికి వెళ్లావు నాన్న..? నీ గురించి ఎంత కంగారుపడ్డానో తెలుసా..?
నీ గురించి
ఎక్కడ ఎక్కడ వెతికేనో తెలుసా..? అంటూ నెమ్మదిగా బుజ్జగిస్తూ హిమ దగ్గరకు వెళ్తాడు. అప్పటికీ హిమ సమాధానం చెప్పకపోవడంతో.. కార్తీక్ దగ్గరకు వెళ్లి. చెంపలు వేసుకుని, ‘ అమ్మ నేను చేసింది తప్పే..నీకు అబద్ధం చెప్పడం తప్పే.. కానీ నీకు నిజం చెప్పడం నావల్ల కాలేదు..కేవలం నిజం చెప్పలేక మాత్రమే నేతో అలా అబద్దం చెప్పాను. అని అంటాడు. హిమ అప్పటికి ఏమి మాట్లాడక పోయేసరికి సౌందర్య, దీప, సౌర్య లు ఎంతో బాధగా చూస్తూ ఉండిపోతారు.
హిమ మాత్రం ఏమి సమాధానం చెప్పకుండా, కార్తీక్ ని మళ్ళీ ఒకసారి తన తల్లి గురించి ప్రశ్నిస్తుంది. నాకు నాన్న ఉన్నప్పుడు అమ్మ కూడా ఉండాలి కదా అని ప్రశ్నిస్తుంది? అందుకు ఉదాహరణగా.. నీకు నానమ్మ ఉంది కదా.. దీపు గాడికి శ్రావ్య పిన్ని ఉంది కదా.. అలాగే సౌర్య కి వంటలక్క ఉంది కదా.. అలాగే మరి నాకు కూడా ఓ అమ్మ ఉండాలిగా అంటూ కార్తీక్ని గట్టిగా నిలదీస్తుంది. అందుకు కార్తీక్ ఏమి సమాధానం ఇవ్వకపోవడంతో మౌనంగా మెట్లు ఎక్కి పైకి వెళ్లడానికి నాలుగు మెట్లు ఎక్కుతుంది. దాంతో ఎంతో భారమైన హృదయంతో కార్తీక్ హేమ కు నిజం చెప్తాడు. ‘ నిజంగా మీ అమ్మ ఎవరో నాకు తెలియదు హిమ’ నేను మీ నాన్నని కాదు అని ఎంతో ఉద్వేగంగా చెప్తాడు. హేమ తో పాటు సౌందర్య, దీప, సౌర్య లు షాక్ అయి అలా నిలబడిపోతారు. సౌందర్యకు తను తప్పు చేశాననే భావన మనసులో కలుగుతుంది.
హిమ షాకై రెండు మెట్లు దిగుతుంది.. అలాగే బాధపడుతూ కార్తీక్ మరోసారి నేను నీ కన్న తండ్రిని కాదమ్మా అని అంటాడు. దాంతో హేమ ఏడుస్తూ, పరిగెత్తుకుంటూ వచ్చి కార్తీక్ ని గట్టిగా పట్టుకుంటుంది. హిమ ఎక్కి ఏడుస్తూ కార్తీక్ ని గట్టిగా పట్టుకుని…’ ఇంకేదైనా చెప్పు డాడీ, నన్ను ఏదైనా తిట్టు, కానీ నువ్వు నా కన్నతండ్రి కాదని మాత్రం అనొద్దు’. అంటుంది. అంత బాధ పడుతున్న హిమను చూడలేక, కార్తీక్, సౌందర్య తో ‘మమ్మీ.. నా వల్ల కావట్లేదు.. నువ్వైనా చెప్పు మమ్మీ’ అంటాడు. దాంతో హిమ సౌందర్య వైపు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుంది. నానమ్మ ఏం చెప్తుందో అన్న ఆత్రుతతో హిమ సౌందర్య వైపు తదేకంగా చూస్తూ నే ఉంటుంది. దీప సౌందర్య వైపు చూసి నిజము చెప్పద్దు అత్తమ్మ అన్నట్లు ఎంతో బాధగా తల అడ్డంగా ఊపుతుంది. అప్పటికే ఏడుస్తున్న సౌందర్య హిమను తన దగ్గరకు తీసుకుని, గట్టిగా హత్తుకుని బాధపడుతుంది.
అయితే అప్పటిదాకా ఓపిక పట్టిన ఆదిత్య..’నిజం హిమ.. నేను చెప్పింది నిజం. కేవలం నువ్వు బాధపడతావ్ అనే మేమంతా ఈ నిజాన్ని నీకు తెలియకుండా దాచాం’ అంటాడు కార్తీక్. అప్పుడు
హిమ, వంటలక్క వైపు ఎంతో దీనంగా చూస్తుంది. అలా చిన్నగా వంటలక్క వైపు నడుచుకుంటూ వెళ్లి, ‘వంటలక్క.. నిజం , తన తల్లి కిచెప్పు, నీకు కూడా ఈ నిజం తెలుసా.. మా డాడీ మా డాడీ కాదా?’ అని బాధగా ఏడుస్తూ అడుగుతుంది.. వెంటనే దీప ఎంతో బాధతో హిమను తన గుండెలకు హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. దీప ‘అమ్మ హిమ…’ అని అలా ఏడుస్తూ ఉంటే, ప్రేక్షకుల గుండెలు బరువెక్క మానవు. దాంతో సౌర్య కూడా, తన తల్లికి ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటూ..ఎంతో బాధగా చూస్తూనే ఉండిపోతుంది. ఎంతో రసవత్తరమైన ఈ సన్నివేశాన్ని నటీనటులు చాలా చక్కగా పండించారు. ఈ సన్నివేశంలో కన్నీటితో ప్రేక్షకుల చెంపలు తడవక మానదు.
ఇక నెమ్మదిగా కార్తీక్ హిమ దగ్గరకు వచ్చి.. తనను దగ్గరకు తీసుకుని.. మోకాళ్ళ పైన కూర్చుని.. ఎంతో బాధతో, బరువెక్కిన హృదయంతో హిమతో ఇలా అంటాడు. ‘అమ్మ హిమ.. నీ వాళ్ళు ఎవరో నాకు నిజంగా తెలియదు. మీ నానమ్మ, నేను చిన్నప్పుడు తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. అప్పటి నుంచి నేను నిన్ను కంటికి రెప్పలా..’ అని చెబుతూ ఉంటాడు.. అంతలో హిమ ఏడుపు ఆపేసి, కార్తీక మాటలకు అడ్డు పడి, బాధగా ‘ నన్ను తెచ్చుకుని పెంచుకున్నావా డాడీ అని అంటుంది..? కార్తీక్ షాక్ అయ్యి హిమ వైపే చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో హిమ, కార్తీక్ చేతిలోనే కళ్ళు తిరిగి పడిపోయింది. అందరూ ‘అమ్మ హిమ’ అంటూ ఎంతో కంగారుగా హిమ వైపు పరుగులు తీస్తారు. సౌర్య మాత్రం, ఎంతో బాధతో.. వెనక్కి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతుంది.
ఎంతో ఆసక్తికరంగా.. ఆద్యంతం ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో, కార్తీకదీపం సీరియల్ కొనసాగుతూనే ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో మిస్ కాకుండా చూడండి..