Karthika deepam september 18 episode

karthika deepam september 18 episode : ఎన్నో ఆసక్తికరమైన సన్నివేశాలతో, అనూహ్యమైన మలుపు ల తో, బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సాగిపోతోంది కార్తీకదీపం సీరియల్.. Check here for karthika deepam september 17 episode
ఈ రోజు కార్తీక సీరియల్ దీపం సీరియల్ మొదలవగానే.. మౌనిత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కార్తీక కోసం తన వెతుకులాట మొదలవుతుంది. ఇంట్లో ఎక్కడ కార్తీక కనిపించకపోయేసరికి కింద సోఫాలో పడుకుని ఉన్న హిమ తీసుకొనివచ్చి పైన బెడ్రూంలో పడుకో పెడుతుంది. ఇంతలో ఎవరో డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. డోర్ కొట్టింది డ్రైవర్ అయి ఉంటాడు అని అనుకుని తలుపు తెరవడానికి సంతోషిస్తుంది మౌనిత. ఎంతసేపటికి ఆపకుండా డోర్ కొడుతూనే ఉంటారు బయటనుంచి.
డోర్ ఓపెన్ చేస్తే తన విషయం తెలిసి పోతుందని మౌనిత భయపడుతుంది. అలాగే భయపడుతూనే డోర్ ఓపెన్ చేయాలా వద్దా అని సందేహంతో కాసేపు చూస్తుంది. కానీ డోర్ కొడుతూనే ఉండేసరికి, నెమ్మదిగా డోర్ ఓపెన్ చేస్తుంది మౌనిత. మొదట్లో డ్రైవర్ అనుకోని కంగారుపడిన మౌనిక డాక్టర్ బాబు ని చూసి కొద్దిగా ఊరట చెందుతుంది. ఎంతసేపు తలుపు తట్టినా తీయలేదు ఎందుకు అని డాక్టర్ బాబు మౌనికను ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా నేను వాష్ రూమ్ లో ఉన్నాను అని మౌనిత చెప్తుంది. వాష్ రూమ్ కి కూడా డోర్ ఉంటుంది కదా అది వేసుకోవచ్చు కదా ఎందుకు మెయిన్ డోర్ వేసాము అని తిరిగి ప్రశ్నిస్తాడు డాక్టర్ బాబు. దానికి ఏమి సమాధానం ఇవ్వకుండా నిలబడిపోతుంది మౌనిత. కింద డ్రైవర్ పిలుస్తున్నా వినపడకుండా మెట్లెక్కి వచ్చేసాము ఎందుకు అని డాక్టర్ బాబు వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తాడు.
దానికి సమాధానంగా మౌనిత, నేను హిమ ను ఎత్తుకొని పైకి తీసుకు వచ్చాను కదా చేతిలో బరువు ఉండటం వల్ల నేను వెనక్కి తిరిగి చూడ లేక పోయాను అని సమాధానం ఇస్తుంది. డ్రైవర్ ఎక్కడున్నాడు అని ఆరా తీస్తుంది మౌనిత. అమ్మ ఫోన్ వంటలక్క ఇంట్లో మరిచిపోయిందని, అది తీసుకురావడానికి డ్రైవర్ని పంపించింది అని సమాధానమిస్తాడు డ్డాక్టర్ బాబు. ఈ సమాధానంతో కాస్త ఊపిరి పీల్చు కుంటుంది మౌనిత. హమ్మయ్య ఇప్పుడే డ్రైవర్ రాడు కనుక డాక్టర్ బాబు తో మాట్లాడొచ్చు అని అనుకుంటుంది. హిమ నిద్ర పోతోంది అని చూసి డాక్టర్బాబు, డిస్టర్బ్ చేయకుండా మనము కిందకు వెళ్లి మాట్లాడుకుందాము అంటాడు’. ఇద్దరు కలిసి కిందికి దిగుతుండగా, కింద సౌందర్య ని చూసి ఆగి పోయి మనం పైనే మాట్లాడుకుందాము అంటుంది మౌనిత. పైన రూమ్ లో హేమ నిద్ర పోతుంది కదా.. డిస్టర్బ్ చేయడం ఎందుకు అంటారు డాక్టర్ బాబు. ఆ అవును అది నిజమే అంటూ తప్పక కింద కి వెళ్లడానికి మళ్లీ సిద్ధపడుతుంది మౌనిత.
అప్పటికే, డ్రైవర్ రూమ్ని గడియపెట్టి మౌనిత ఇంట్లోకి ప్రవేశించిన విషయం గమనించిన సౌందర్య.. ఆ విషయాన్ని ప్రశ్నించే లోపే, మాటను దాటవేయడం కోసం మౌనిత, డాక్టర్ బాబు…పిల్ల ఆరోగ్య పరిస్థితి బాలేదు అని తెలిసి తన మానసిక పరిస్థితి తెలిసి హిమ ను అలా వదిలేసి వంటలక్క ఇంటికి వెళ్లి ముచ్చట్లు ఆడి వస్తున్నారా అని ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నకి సౌందర్యగా ఇంకా డాక్టర్ బాబు కూడా ఆశ్చర్యపోతారు. నేను వచ్చేసరికి పాపా అమ్మ అమ్మ అని కలవరిస్తూ.. సోఫాలో నిద్ర పోయింది అని చెప్పి తన ఫోన్లో తీసిన వీడియో ను చూపిస్తుంది.
ఆ వీడియో చూసిన సౌందర్య డాక్టర్ బాబు కొద్దిగా తడబడి నప్పటికీ, సౌందర్య మళ్లీ మామూలు స్థితికి వచ్చి ..పెళ్లి , పిల్లలు లేని నువ్వు పిల్లల్ని ఎలా పెంచాలో మాకు నేర్పించకర్లేదు అంటుంది సౌందర్య. ఆ విషయం అలా ఉంచి డ్రైవర్ రూమ్ కి ఎవరు గడియ పెట్టారో చెప్పమని మౌని తను నిలదీస్తుంది. దానికి సమాధానంగా మౌనిక నాకు డ్రైవర్ కి ఇక్కడ ఒక రూము ఉందనే సంగతి తెలియదు, అలాంటప్పుడు నేను ఎలా వేస్తారు అని చెబుతుంది.
అప్పుడు సౌందర్య ఇంట్లో నువ్వు తప్పితే ఎవరూ లేరు అలాంటప్పుడు నువ్వు కాక ఎవరు గడియ వేస్తారు అని అడుగుతుంది? దానికి సమాధానంగా మౌనిత ఇలా అంటుంది..’నేను వచ్చేటపుడు బయట చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. బాల్ లోపలికి వెళ్ళి పోతుందేమో అని అక్కడ పిల్లలు కూడా గడియవేసి ఉండొచ్చు కదా అని అంటుంది.? ఇంతలో సౌందర్య చిన్న కోడలు బయటకు వస్తుంది. అదిగో నీ చిన్న కోడలు వస్తోంది గా తనని అడగండి అని మౌనిత అంటుంది. సౌందర్య చిన్న కోడల్ని అడిగితే..నేను ఫోన్ మాట్లాడు కుంటూ బయటకు వచ్చేసరికి మౌనిత గేటు తీసుకుని లోపలికి వస్తుంది అత్తయ్య ఉంటుంది. అప్పుడు మౌనిత చూశారా డాక్టర్ బాబు భరత్ కి నేను ఇంటికి రావడం ఇష్టం లేదు ఏదో ఒక రూపంలో నా మీద అభిమానం వేస్తోంది నేను ఇంకా మీ ఇంటికి రాను అని అంటుంది.
సీన్ కట్ చేస్తే నిద్ర పోతున్న హేమ రూమ్ కి వస్తాడు డాక్టర్ బాబు.. హేమ వైపు అలానే చూస్తూ ఉండి ఆలోచనలో పడతాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం తల్లి. కానీ మనం ఇక్కడే ఉంటే మనల్ని విడదీయడానికి ప్రయత్నిస్తారు. మనము వేరే చోటికి వెళ్ళి పోదాము అని పాపతో చెప్పలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. నేను ఎప్పటి లాగానే పాత డాక్టర్ బాబు లాగానే ఉండిపోతాను తల్లి, అని తన మనసులో ఆలోచిస్తూ ఉంటాడు..
ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఇకపై ఏం జరగనుందో తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం.. కార్తీకదీపం కొనసాగుతోంది..