కార్తీకదీపం సెప్టెంబర్ 17 ఎపిసోడ్!

karthika deepam september 17 episode: ఎన్నో ఆసక్తికరమైన మలుపులతో బుల్లితెర ప్రేక్షకులను ఆద్యాతం అలరిస్తోంది కార్తీకదీపం సీరియల్. ఇంతటి ఆసక్తికరమైన సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ..
సీరియల్ మొదలవ్వగానే..
హిమ అనాధ కాదు, తనని అనాధ అని పదేపదే అనొద్దు అని అత్తగారితో దీప అంటుంది. హిమ అనాథ కాదు నా కూతురన్న విషయాన్ని కార్తీక్ తో చెబుదామని అత్తగారితో అంటుంది. ఇద్దరు నాకు కూతురులే అని, వాళ్ళిద్దర్నీ నేనే పెంచుకుంటా అని అంటుంది దీప. వీళ్లిద్దరి మధ్య సంభాషణ జరుగుతుండగానే కార్తీక్ దీప ఇంటికి వస్తాడు. దీప మాటలు విన్న కార్తిక్, నువ్వు హిమకి ఏమీ చెప్పక్కర్లేదు అని, హిమ నీకు ఏమీ కాదని, ఇంకా మాట్లాడితే నీకు హిమకే కాదు, నీకు నాకు కూడా ఏ సంబంధం లేదు అంటాడు కార్తీక్. నువ్వు నా భార్యవి కాదు అంటాడు. ఎప్పటికీ నువ్వు వంటలక్కే అని, నా భార్య స్థానంలో నువ్వు లేవు అని అంటాడు కార్తీక్.
నీ కూతురు కోసం, ఇంకా నీ కూతురు అవసరాలకోసం దీపను పనిమనిషిగా మార్చావు అని, సౌందర్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. కానీ కార్తీక్ మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వంటలక్క ఎప్పటికీ నా భార్య కాలేదు అని నిక్కచ్చిగా చెప్తాడు. మన ఇంట్లో జరిగిన ప్రతి విషయాన్ని తీసుకొచ్చి వంటలక్క ఇంట్లో ఎందుకు చెప్తున్నావు అని అమ్మని ( సౌందర్య ) ప్రశ్నిస్తాడు. దీప చేసే ప్రతి పనికి నువ్వు సపోర్ట్ చేసి, నాకు ఇద్దరూ కలిసి తలవంపులు తీసుకొస్తున్నారు అని ఆవేశ పడతాడు. కార్తీక్, దీపని సౌందర్య ని కోప్పడి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. వెనకాలే దీప వెళ్లబోతుంటే, అత్తగారైన సౌందర్య దీపం ఆపుతుంది. దీపా.. వాడు ఆవేశంలో ఉన్నాడు, నువ్వు కూడా ఆవేశ పడద్దు,నేను వాడితో నెమ్మదిగా మాట్లాడతాను అని చెప్పి అక్కడి నుంచి సౌందర్య కూడా వెళ్ళిపోతుంది. ఈ మాటలకు బాధపడిన దీప సోఫాలో కూలబడుతుంది. వాళ్లు వెళ్లగానే సౌర్య ( దీప కూతురు) ఇంటికి వస్తుంది.
ఇంటికి వచ్చిన సౌర్య, దీప ఎంతో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తుంది. ఇలా అమ్మని చూసిన సౌర్య ‘అమ్మ టేబుల్ మీద పెట్టిన టీ కూడా తాగకుండా ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్, డాక్టర్ బాబు ఇంకా, నానమ్మ మన ఇంటికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తుంది’. దీప ఆ విషయాన్ని దాట వేయడానికి ప్రయత్నిస్తుంది. అమ్మ ..నేను అన్ని విషయాలను పక్కింట్లో ఉండి గమనిస్తూనే ఉన్నాను అంటుంది సౌర్య. నువ్వు చెప్పకపోయినా, నేను జరిగిందేమిటో నానమ్మ ని అడిగి తెలుసుకుంటాను అని చెబుతుంది. ఇక తప్పక, ఒక ఒప్పందం మీద నువ్వు ఎవరికీ చెప్పను అంటే, నీకు జరిగింది చెప్తాను అని అంటుంది దీప. సౌర్య ఒప్పుకున్నాక, దీప జరిగిన విషయాన్ని చెబుతుంది. డాక్టర్ బాబు హేమకి ‘నువ్వు అనాధవి అని చెప్పేస్తాను’ అని అన్నాడు అని చెబుతుంది.
సీన్ కట్ చేస్తే..
ఇంతలో మోహిత (డాక్టర్ బాబు స్నేహితురాలు) డాక్టర్ బాబు ఇంటికి వస్తుంది. మోహిత కు డాక్టర్ బాబు డ్రైవర్ గురించి ఆలోచన వస్తుంది. డ్రైవర్ ఎక్కడున్నాడో..ఏం చేస్తున్నాడో వాడు లేనప్పుడు ఇంట్లోకి జాగ్రత్తగా వెళ్ళాలి అని ముందుగా అవుట్ హౌస్ లో ఉన్న డ్రైవర్ ఏం చేస్తున్నాడు అని చెక్ చేస్తుంది. డ్రైవర్ ఇంట్లో మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. నెమ్మదిగా అవుట్ హౌస్ బయట డోర్ గడియ వేస్తుంది మోహిత. ఇక నెమ్మదిగా డాక్టర్ బాబు ఇంట్లోకి ప్రవేశించి డాక్టర్ బాబు కోసం వెతకటం మొదలు పెడుతుంది.
ఇకపై ఏం జరగనుందో తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం.. కార్తీకదీపం కొనసాగుతోంది..