Kapatadhaari Movie Trailer : ‘కపటధారి’ ట్రైలర్ రిలీజ్.. ఇక సమరమే అంటున్న సుమంత్…!

Kapatadhaari Movie Theme Trailer: అక్కినేని సుమంత్ హీరో గా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కపటధారి’. ఈ సినిమా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం లో తెరకెక్కుతుండగా… క్రియేటివ్ ఎంటర్ టైన్మెంట్స్ మరియు బొఫ్తా మీడియా బ్యానర్ పై ధనుంజయన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కన్నడ లో సూపర్ హిట్ సాధించిన ‘కావలధారి’ అనే మూవీకి రీమేక్ గా వస్తుంది.
ఆదేవిందగా ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్, టీజర్లు సినిమపై అంచనాలను పెంచుతున్నాయి. అలాగే ఆసక్తిని కూడా కలిగిస్తున్నాయి. ఈ ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో చిత్ర యూనిట్ ‘కపటధారి’ ట్రైలర్ రిలీజ్ విడుదల చేసింది.
ట్రైలర్ ని గమనిస్తే… ఒక హత్యకు సంబంధించి, పోలీస్ డిపార్ట్ మెంట్కు అంతుచిక్కని ఆ రహస్యాన్ని ఓక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎలా డీల్ చేసాడనే కథతో రాబోతుంది. ఇందులో సమరం చేయాలి అని చెప్పే మాంటేజ్ సాంగ్ ట్రైలర్లో ఆకట్టుకుంటుంది. ఒక హంతుకుడిని రహస్యాంగా ఉంచి.. సినిమాపై ఇంట్రెస్ట్ కలిగేలా చేసారు మేకర్స్. ఈ సినిమాకు సైమన్ కె.కింగ్ బాణీలను అందించగా జయప్రకాశ్, నాజర్, సంపత్, తదితరులు సినిమాలో ఉన్నారు.