Tollywood news in telugu

Kapatadhaari Movie Review : ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కపటదారి’…. క్రైమ్ థ్రిల్లర్తో బయపెట్టిస్తున్న సుమంత్..!

Kapatadhaari Movie Review

ప్రొడ్యూసర్ : ధనుంజయన్

డైరెక్టర్ : ప్రదీప్ కృష్ణమూర్తి

నటినటులు : అక్కినేని సుమంత్, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్, నందితా శ్వాత, వెన్నెల కిషోర్ ,

కన్నడ సూపర్ హిట్‌ మూవీ  ‘కావలధారి’కి రిమేక్‌ గా తెలుగులో ‘కపటదారి ‘ గ వచ్చింది. ఇందులో  అక్కినేని సుమంత్ హీరోగా చాల రోజుల తర్వాత వచ్చాడు. ఈ సినిమా క్రియేటివ్ ఎంటర్ టైన్మెంట్స్‌ & బొఫ్తా మీడియా బ్యానర్ పై  నిర్మించబడింది. ఇందులో సుమంత్ ఒక ట్రాఫిక్ పోలీస్ గా కనిపించాడు. ఒక క్రైమ్ థ్రిల్లర్‌ గా సాగె ఈ సినిమాలో ఎన్నో ఆసక్తిని కలిగించే అంశాలు ఉన్నాయ్.

 అందులో   సుమంత్ తన స్టేషన్  పరిధిలోకి రాని  మర్డర్‌ మిస్టరీ కేసులను కూడా   ఎలా సాల్వు చేశారన్న.. కథాంశంతో  సినిమాను తెరకెక్కించారు. 

 కథ :

సుమంత్ ఒక ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా విధులను నిర్వర్తిస్తూ ఉంటాడు. కానీ  అతనికి క్రైమ్ డిపార్ట్‌‌‌మెంట్‌‌‌‌లో పనిచేయాలని కోరిక. కాని అందుకు పై అధికారులు ఒప్పుకోకపోవడంతో.. అయిష్టంగానే  ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తాడు. ఈ క్రమంలో.. మెట్రో పిల్లర్‌ నిర్మాణానికై  తవ్వకాలు చేపట్టగా అనుకోకుండా అస్తిపంజరాలు కనపడుతాయి. ఆ  అస్తిపంజరాలు నల‌భై యేళ్ల కిందివి అని తెలిసి,  కేసును సాల్వ్‌ చేయలేక మూసివేసే ప్రయత్నంలో  ఉంటాడు క్రైమ్‌ ఎస్సై..ఆ సందర్భంలో ట్రాఫిక్ పోలీసైన సుమంత్ (గౌతమ్)‌  ఈ కేసును సాల్వ్‌ ఎలాగైనా ఛేదించాలని పట్టుబట్టి,  ట్రాఫిక్ ఎస్సై గౌత‌మ్ ఆ హ‌త్య‌‌ల వెన‌క నిజాల్ని కనిపెడతాడా? ఈ  క్ర‌మంలో గౌతమ్ కి  ఎలాంటి సమస్యలు ఎదుర‌య్యాయి?  న‌ల‌భ‌య్యేళ్ల కింద‌ట ఆ హత్యలను చేసినవారు ఎవరు  ?  అన్న కోణంలో ఈ కథ సాగుతుంది.

థ్రిల్లర్ తరహా మూడ్‌ను స్క్రీన్‌ పై ప్రజెంట్ చేసారు.  కానీ ఈ సినిమాలో మాత్రం మర్డర్లు  ఎప్పుడో న‌ల‌భ‌య్యేళ్ల క్రితం జరిగాయి.  దీంతో ఆ మర్డర్లకు సంబంధిచిన ఆధారాలే కాదు, మ‌నుషులు.. ప‌రిస్థితులు అన్నీ మారిపోయి న తరుణంలో ఈ  క్లిష్ట‌మైన కేస్‌ని గౌతమ్ చేధించిన విధానం  ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈ సినిమా ఫస్ట్‌ ఆఫ్‌లో హీరో సుమంత్‌ క్రైమ్ పోలీస్ అవడానికి పడిన కష్టాలు .. హత్యకు  సంబంధించి అస్తి పంజరాలను చూపించిన డైరెక్టర్‌.. సెకండ్‌ ఆఫ్‌లో ఆ కేసును ఛేదించే  విధానాన్ని ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. దీని ద్వారా ప్రేక్షకులకు మంచి థ్రిల్ కి గురవుతారు.

సాంకేతికంగా ఈ సినిమా బాగుంది.  సంగీతం, కెమెరా విభాగాల పనితీరు బాగున్నాయి.  దర్శ‌కుడు ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి తీశారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కథను సాగదీసినట్టు చూపించారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button