Tollywood news in telugu
‘తలైవి’ పాత్రలో కంగనా రనౌత్ స్టిల్స్ !

తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి జయలలిత బయోపిక్‌కు సంబంధించిన కొన్ని స్టిల్స్ ను సోషల్ మీడియాలో తన అభిమానులకోసం పోస్ట్ పెట్టారు.
దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’ సినిమాకి సంబంధించి షూటింగ్ లోని ఒక వర్కింగ్ స్టిల్స్ ను తన ట్విట్టర్ లో పెట్టారు.
ఈ రోజు జయలలిత వర్ధంతి సందర్భంగా కంగనా రనౌత్ నివాళులర్పించారు. మరికొన్ని రోజుల్లో సినిమా పూర్తికాబోతుందని కంగనా తెలియజేసింది.