Kangana Ranaut: స్త్రీలకు కావాల్సింది వేతనం కాదు గౌరవం అంటూ కమల్ హాసన్ పై విరుచుకుపడ్డ కంగనా

Kangana Ranaut: స్త్రీలకు కావాల్సింది వేతనం కాదు గౌరవం అంటూ కమల్ హాసన్ పై విరుచుకుపడ్డ కంగనా: బాలీవుడ్లో సుశాంత్ సింగ్ మరణం పట్ల షాకింగ్ కామెంట్స్ చేసి… అధికార పార్టీ పై ఎదురొడ్డి పోరాడిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ విలక్షణ నటుడు, రాజకీయ నాయకుడైనా కమలహాసన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

కమల్ హాసన్ ఇటీవలే పార్టీ పెట్టి రాజకీయాలకు కూడా రంగ ప్రవేశం చేశారు. ఈ మేరకు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కమల్ హాసన్ తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటి గృహానికి వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్ని సమర్థిస్తూ మాజీ మంత్రి శశి థరూర్ ట్వీట్ చేశారు. దీనిపై కంగనారనౌత్ స్పందిస్తూ…” ఒక భార్య తల్లి ఇంట్లో పని చేయడం తమ హక్కు …దానికి వేల కట్టి వ్యాపారంగా మార్చకండి.. ఒక ఇంటి యజమానిని తన సొంత ఇంటిలోనే ఉద్యోగిగా మార్చకండి.. స్త్రీలకు కావాల్సింది వేతనం కాదు సమాజంలో గౌరవం” అంటూ కంగనా రావత్ ట్వీట్ చేశారు.