సినిమా :- Kanabadutaledu movie review in telugu

Kanabadutaledu movie review And Rating :: కనబడుటలేదు (2021), నటీనటులు:- సునీల్, సుక్రాంత్ వీరెల్లా, వైశాలిరాజ్, హిమజ, యుగ్రామ్, నిర్మాతలు:- SS సినిమాలు, శ్రీ పాద క్రియేషన్స్ మరియు షేడ్ స్టూడియోస్, డైరెక్టర్ :- బాలరాజు ఎం, మ్యూజిక్ డైరెక్టర్ :- మధు పొన్నాస్
లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో సునీల్ నటించిన కనబడుటలేదు ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే కనబడుటలేదు వచ్చింది. ఇప్పుడీ సినిమా ఎలా ఉందొ చూద్దాం.
కథ :-
ఈ కథ శశిద (వైశాలి రాజ్) మరియు ఆదిత్య (యుగ్ రామ్) లా వివాహం తో మొదలవుతుంది. శశిద కి ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు. గతం లో తన బాయ్ ఫ్రెండ్ అయినా సుక్రాంత్ వీరాల్లా మోసం చేయడం తో , పెద్దలు ఇష్టం లేని పెళ్లి చేశారు. భర్త సహాయం తో తనని మోసం చేసిన సూర్య ని చంపాలనుకుంటుంది. అనుకున్నట్లుగానే భార్య భర్త కలిసి వైజాగ్ వెళ్తారు సూర్య ని చంపడానికి. అయితే వాలు వైజాగ్ వెళ్లి సూర్య కోసం వెతికే క్రమం లో సూర్య కనిపించడం లేదు అని తెలుస్తుంది. సూర్య ఎందుకు శశిద ని మోసం చేయాల్సి వచ్చింది? ఎందుకు కనిపించకుండా పోయాడు? అసలు సూర్య కి ఎం అయింది? సునీల్ ఎం చేయబోతున్నారు ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
👍🏻:-
- వైశాలిరాజ్ చాల అద్భుతంగా నటించి ప్రజల ఆదర్శన పొందుతుంది. సునీల్ కూడా చాల డిఫరెంట్ గా ప్రేక్షకులని అలరిస్తారు. మిగిలినవారు కూడా వారి పాత్రలకి న్యాయం చేసారు.
- సెకండ్ హాఫ్
- కథ బాగుంది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
” సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ బాగున్నాయి.
*సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
👎🏻:-
- కధనం బాలేదు.
- ఎగ్జిక్యూషన్ అసలు బాలేదు.
- ఫస్ట్ హాఫ్ మరియు దర్శకత్వం.
ముగింపు :-
మొత్తానికి కనబడుటలేదు అనే సినిమా పేపర్ మీద బాగా రాసుకున్న ఎగ్జిక్యూట్ చేయడం లో పూర్తిగా విఫలం అయ్యారు చిత్ర బృందం. నటీనటులు అందరు బాగా చేసిన సరిగా కధనం రాసుకోకపోవడం తో ప్రేక్షకులకి అసంతృప్తి కలిగిస్తుంది. సునీల్ పాత్రా సెకండ్ హాఫ్ లో రావడం తో ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ పర్వాలేదనిపిస్తది. దర్శకుడు సరిగా చేయకపోవడం తోనే మంచి కథ వృధా అయిపొయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఈ వారం ఈ సినిమా చూడకుండా వేరే ప్లాన్ వేసుకోవడం బెటర్.
Rating:- 1.5/5 (కనబడలేదు, వినబడలేదు)