కమల్ హాసాన్ పార్టీ ఎంఎన్ఎం లో చేరిన మాజీ ఐఏఎస్ అధికారి !

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో రాబోతున్నందున ఆయా పార్టీల్లో వలసలు ప్రారంభమయ్యాయి . నటుడు కమల్‌హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం)లో మాజీ ఐఏఎస్ సంతోష్ బాబు మంగళవారంనాడు పార్టీ తీర్తం పుచ్చుకున్నారు . బాబు కు కమల్‌హాసన్ పార్టీ సభ్యుత్వాన్ని అందజేశారు. ఇతనిని ఎంఎన్ఎం ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
ఈ సందర్భంగా కమల్‌హాసన్ మాట్లాడుతూ, సంతోష్ బాబు డాక్టర్ అని, ఐఏఎస్ అధికారిగా 25 ఏళ్ళు తన సేవలను అందించారని చెప్పారు. ఎనిమిది సంవత్సరాలు ముందుగానే ఆయన పదవిని వీడారని అన్నారు. రాబోయే రోజుల్లో మంచి వ్యక్తులను పార్టీలోకి ఆయన తీసుకు వస్తారని చెప్పారు.
పార్టీ ప్రధాన కార్యాలయ నిర్వహణ బాధ్యతలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టో రూపకల్పన బాధ్యతలు కూడా సంతోష్ బాబు ఇకనుండి చేసుకోబోతున్నారని ప్రజలకు తెలియజేసాడు.