Tollywood news in telugu

తారక్ విషయం పైనే కల్యాణ్ రాం క్లారిటీ

ntr బయో పిక్ లో జూనియర్ ntrకు క్యారెక్టర్ లేకపోవడం వెనక కారణం వెల్లడించిన కళ్యాణ్ రాం.

ntr బయో పిక్ ఇంకో అయిదురోజుల్లో పండగ కానుకగా మొదటి పార్ట్ కథానాయకుడు రిలీజ్ అయ్యే సమయంలో ప్రమోషన్ లో భాగంగా సినిమాలో ntr తనయుడు హరికృష్ణ పాత్ర పోషించిన కళ్యాణ్ రామ్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలకు క్లారిటీ ఇచ్చారు.

సినిమాలో జూనియర్ ntrను తీసుకోక పోవడం వెనక వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయ్ అని పుకార్లు లేపారని నిజంగా అలాంటిది ఏం లేదని ఒకవేళ ఉంటే బయోపిక్ ఆడియో రిలీజ్ రోజున పిలిస్తే ఎలా వస్తాడని, అంతే కాకుండా ఈ బయోపిక్ లో తారక్ కు క్యారెక్టర్ ఇవ్వకపోవడము వెనక కారణం కూడా తెలిపాడు.

తారక్ ఇప్పుడు ఒక పెద్ద స్టార్ అని తనకు తగిన గొప్ప క్యారెక్టర్ ఇందులో లేదని అన్ని పాత్రలు నిడివి తక్కువ గలవి అని అందువల్ల తారక్ కు అలాంటి చిన్న పాత్ర కేటాయించడం బాబాయ్ కు ఇష్టం లేదని ఒకవేళ కేటాయిస్తే తన ఫ్యాన్స్ నుండి విమర్శలు వచ్చేవి అని అందువల్లే పెట్టలేదని సమాధానం ఇచ్చారు. ఎప్పుడైన తామంతా ఒకటే అని పుకార్లు పుట్టించే వాళ్ళకి హితవు పలికారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button